ఆరెక్స్ 100 రూపంలో డెబ్యూతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయకు ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆస్థాయి హిట్టు కాదు కదా కనీసం యావరేజ్ కూడా దక్కడం లేదు. అయినా సరే అదృష్టం బాగుండి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వలిమైలో విలన్ గా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగకపోవడం కుర్రహీరోని బాధించింది. అజిత్ ఎంతవాడుగానిలో నటించాకే అరుణ్ విజయ్ కి స్టార్ డం వచ్చినట్టు తనకూ జరుగుతుందని ఆశించాడు కానీ పనవ్వలేదు. ఇతని కొత్త చిత్రం బెదురులంక 2012 ఎప్పుడో పూర్తయి ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది.
విడుదల తేదీని అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇటీవలే దీని ప్రీమియర్ ని మైత్రి నిర్మాతలకు వేశారట. కొనుగోలు చేయడమో లేదా డిస్ట్రిబ్యూషన్ కి సహకరించడమో చేసేందుకు ఈ షో వేసినట్టు వినికిడి. అయితే సినిమా చూశాక యథాతధంగా విడుదల చేస్తే వర్కౌట్ కాదని కొన్ని కీలక మార్పులు సూచించారట. ప్రస్తుతం దర్శకుడు క్లాక్స్ కొంత కీలక భాగాన్ని రీ షూట్ చేసే పనిలో పడ్డాడని వినికిడి. 2012లో యుగాంతం వస్తుందనే పుకార్లను ఆధారం చేసుకుని కామెడీ ప్రధానంగా ఈ కథను రాసుకున్నారు,
ఏది ఏమైనా చిన్న సినిమాల విషయంలో దర్శక రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. పాయింట్ ఎగ్జైట్ చేయగానే సరిపోదు. అది ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా రాసుకోగలమా లేదా అనేది సరి చూసుకోవాలి. ఆ మధ్య సత్యదేవ్ తో స్కైల్యాబ్ అంటూ ఇలాంటి ప్రయత్నమే చేశారు కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడీ బెదురులంకకు సైతం ఆ సమస్య రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త వహించడం మంచిదే. ప్రస్తుతానికి ఏప్రిల్ రిలీజ్ లేదు. మేలోనూ అనుమానాస్పదంగానే ఉంది. మొత్తానికి కార్తికేయతో విజయం దోబూచులాడుతూనే ఉంది