తన కొడుకులను మిగతా వారసుల్లాగే పెద్ద స్టార్లను చేయాలని అనుకున్నాడు అక్కినేని నాగార్జున. కానీ ప్లానింగ్ గట్టిగానే జరిగింది కానీ.. ఆయన కోరుకున్నట్లుగా నాగచైతన్య కానీ, అఖిల్ కానీ పెద్ద స్టార్లు కాలేకపోయారు. చైతూ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి.. అది సాధ్యం కాక లవ్ స్టోరీలతోనే అడపాదడపా విజయాలందుకుంటూ మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక భారీ అంచనాలతో లాంచ్ అయి.. ఆ అంచనాలను అందుకోలేక ఇబ్బంది పడ్డ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఓ మోస్తరు విజయాన్నందుకుని సంతృప్తి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో అతను ‘అఖిల్’తో మాస్ హిట్ కొట్టేసి పెద్ద స్టార్ అయిపోదామన్న ఆశతో ఉన్నాడు. ఐతే అఖిల్ విషయంలో నాగార్జున ఈ మధ్య ఏం పట్టనట్లు ఉంటుండటం చర్చనీయాంశం అవుతోంది. ‘అఖిల్’ తేడా కొట్టాక ‘హలో’ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి తన చిన్న కొడుకును రీలాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నాగ్. కానీ ‘హలో’ తేడా కొట్టేసింది.
ఇక అప్పట్నుంచి నాగ్ తెర వెనుకే ఉంటున్నాడు. అఖిల్‌కు మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు సెట్ చేయడంలో నాగ్ పాత్ర ఎంత వరకు ఉందో కానీ.. ఆయన అయితే పైకి ఆ సినిమాలకు తనకు సంబంధం లేనట్లే ఉండిపోయాడు. అవి రెండూ మీడియం రేంజ్ బడ్జెట్లలో తెరకెక్కిన చిత్రాలే. నిర్మాతలు సేఫ్ జోన్లోనే ఉన్నారు. కానీ ‘ఏజెంట్’ సంగతి అలా కాదు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.80 కోట్లని అంటున్నాడు నిర్మాత అనిల్ సుంకర.
అఖిల్ చివరి సినిమా, పైగా సక్సెస్ ఫుల్ అనిపించుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇందులో సగం ఆదాయం కూడా తెచ్చిపెట్టలేదు. అలాంటిది ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. బడ్జెట్ విషయంలో కచ్చితంగా నాగ్ సాయం ఉండే ఉంటుందని.. లేదంటే అనిల్ ఇంత సాహసం చేసేవాడు కాదని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. కానీ నాగ్ మాత్రం తనకు ఈ సినిమాతో కూడా ఏం సంబంధం లేదన్నట్లుగా సైలెంటుగా ఉంటున్నాడు. ‘ఏజెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా ముఖ్య అతిథిగా ప్రభాస్ వస్తాడని అంటున్నారే తప్ప నాగ్ ఊసే లేదు. మరి ఈ సినిమా సక్సెస్ అయ్యాక అయినా.. నాగ్ లైన్లోకి వస్తాడేమో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 6:21 am
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…