గత మార్చి 30న విడుదలై ఇంకా నెల కూడా పూర్తి చేసుకోని దసరా అప్పుడే ఓటిటి ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలుకాబోతున్నట్టు సదరు యాప్ లో ఉన్న కమింగ్ సూన్ సెక్షన్ లో అధికారికంగా పెట్టేశారు. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. రిలీజ్ కు ముందే చేసుకున్న అగ్రిమెంట్లలో భాగంగా నిర్మాతలు నాలుగు వారాల డీల్ కు అంగీకారం తెలిపారు. దీంతో ఇరవై ఎనిమిది రోజుల విండోతో ఈ బ్లాక్ బస్టర్ ని తన చందాదారులకు చూపించేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. రేపో ఎల్లుండో యాడ్స్ కూడా మొదలవుతాయి.
ఇప్పటిదాకా నూటా పదిహేను కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన దసరా నిజానికి బాక్సాఫీస్ వద్ద నెమ్మదించేసింది. అయినా కూడా మెయిన్ సెంటర్స్ లో వీకండ్ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. శని ఆదివారాలు రావణాసుర, శాకుంతలం లాంటి కొత్త రిలీజుల కన్నా దసరాకే ఎక్కువ ఫిగర్లు నమోదు కావడం అబద్దం కాదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ దీన్ని బాగా సొంతం చేసుకున్నారు. వరస ఫ్లాపుల్లో ఉన్న ప్రొడ్యూసర్ సుధాకర్ కి ఇది మంచి బ్రేక్ ఇచ్చింది.
మరోసారి ఎప్పుడూ జరిగే చర్చే తెరపైకి వస్తోంది. థియేటర్ కు ఓటిటికి మధ్య ఉండాల్సిన గ్యాప్ ని ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఏదో ఆడని సినిమాలు త్వరగా వస్తే ఏదో అనుకోవచ్చు కానీ బాక్సాఫీస్ వద్ద బాగా వసూలు చేసిన దసరా లాంటి వాటిని కూడా ఇలా త్వరగా వదిలేస్తే ఎలా అనే కామెంట్లో న్యాయం లేకపోలేదు. అయినా మారిన పరిస్థితుల్లో కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే ఇన్నేసి రోజులు ఆడుతుందని ఏ నిర్మాతా ముందస్తుగా అంచనా వేయలేకపోతున్నారు. దీని వల్ల ఓటిటి విషయంలో పెట్టుబడి సేఫ్ కావడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
This post was last modified on April 20, 2023 10:03 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…