కెరీర్ ఆరంభంలో హీరోయిన్లు అవకాశాల కోసం చూస్తున్నపుడు తాము చేస్తున్న పాత్రలు ఎలాంటివి అన్నది అస్సలు పట్టించుకోరు. నటనకు ప్రాధాన్యం లేకున్నా.. గ్లామర్ ఒలకబోయడం తప్ప చేసేదేమీ లేకపోయినా పెద్దగా పట్టించుకోరు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుంటారు. కానీ తమకంటూ ఒక స్థాయి వచ్చాక మాత్రం వారి ఆలోచన మారిపోతుంది. అప్పటిదాకా చేసిన పాత్రలు, సినిమాల విషయంలో తెగ ఫీలైపోతుంటారు. తమ టాలెంటుని గుర్తించలేకపోయారని అంతకుముందు తమతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతల మీద పడి ఏడుస్తుంటారు.
ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్లో గుర్తింపు సంపాదించిన హీరోయిన్లకు ఇలాంటి కామెంట్లు చేయడం అలవాటే. ఇలియానా, తాప్సి లాంటి వాళ్లు ఈ కోవకే చెందుతారు. వీళ్ల ప్రయాణం మొదలైంది సౌత్ సినిమాల్లోనే. ఇక్కడే స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. తర్వాత అనుకోకుండా బాలీవుడ్‌కు వెళ్లడం.. అక్కడ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి గుర్తింపు సంపాదించడం జరిగింది. ఇంకేముంది.. సౌత్ మీద కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.
తాప్సి ఇంతకుముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి దక్షిణాది ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఆమె మరోసారి ఇదే రకంగా మాట్లాడింది. తనకు సౌత్ సినిమాల ద్వారానే స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ.. ఇక్కడ తన టాలెంటుని ఎవరూ గుర్తించలేదని ఆమె అంది. రొటీన్ గ్లామర్ రోల్సే ఇచ్చారని.. నటిగా నిరూపించుకోవడానికి అవసరమైన పాత్రలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తాను ఇక్కడ చేసిన పాత్రలు సంతృప్తి ఇవ్వలేదంది.
బాలీవుడ్లో నటించిన పింక్ సినిమాతోనే తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పింది. తాప్సి సౌత్ అని పేర్కొంటున్నప్పటికీ.. ఆమె ఇక్కడ ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే. వాటిలో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసింది. ఐతే ఆ పాత్రలు ఆమెకు ఆఫర్ చేసినపుడు.. తన టాలెంటుకి తగనివి అనిపిస్తే తిరస్కరించడానికి అవకాశముంది. సాయిపల్లవిలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసమే ఎదురు చూసి, వాటినే చేసి గుర్తింపు తెచ్చుకోవాల్సింది. అవసరం కోసం, డబ్బుల కోసం అన్ని పాత్రలూ చేసి ఇప్పుడు సౌత్ సినిమాలను తక్కువ చేసేలా మాట్లాడ్డం ఏంటో?
This post was last modified on April 19, 2023 2:29 pm
ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ…
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…