ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విరూపాక్ష మీద నిర్మాతలు మాములు నమ్మకంగా లేరు. సాధారణంగా సాయి ధరమ్ తేజ్ కి రెగ్యులర్ టైమింగ్ కాకుండా హైదరాబాద్ మినహాయించి ఇతర చోట్ల స్పెషల్ షో లు ఉండవు. కానీ దీనికి మాత్రం ప్రత్యేకంగా కర్నూలు లాంటి జిల్లా కేంద్రంలోనూ ఉదయం ఏడున్నరకు ప్రీమియర్లు వేస్తున్నారంటే వాళ్లకున్న కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవచ్చు. సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ విలేజ్ ఫాంటసీ థ్రిల్లర్ తో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉన్న మాట వాస్తవం.
ఇక బిజినెస్ సంగతి చూస్తే ఏపీ తెలంగాణ కలిపి సుమారు 21 కోట్లకు థియేట్రికల్ డీల్స్ జరిగినట్టుగా ట్రేడ్ టాక్. ఓవర్ సీస్ మరో మూడు కోట్లు అదనం. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కోణంలో చూస్తే ఇది పెద్ద మొత్తమే. అయితే ట్రైలర్ వచ్చాక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. గత నెల దసరా తర్వాత ఇంకే సినిమా కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో సమ్మర్ సీజన్ కి ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పాజిటివ్ టాక్స్ వస్తే ఆపై వారం ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ 2 ఉన్నా కూడా ఇబ్బంది లేదన్న ధీమా టీమ్ లో కనిపిస్తోంది.
ఇటు తేజు, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇద్దరూ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ ఆ రోజుకు పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ శుక్రవారం రంజాన్ పండగ కలిసి వస్తోంది. సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ పోటీలో ఉన్నప్పటికీ తెలుగు జనాల ఫస్ట్ ఛాయస్ విరూపాక్షనే ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ ని గ్రాండ్ గానే ఆశించొచ్చు. తిరిగి జూలైలో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా రిలీజ్ ఉంది కనక అది సక్సెస్ అయితే మావయ్యకే ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది కాబట్టి సోలో హీరోగా విరూపాక్షతో పెద్ద హిట్టు పడాలి.
This post was last modified on April 19, 2023 12:22 pm
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…