బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. గోపీచంద్ మలినేని బాలయ్యను డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బాలయ్య గెటప్ , యాక్షన్ ఎపిసోడ్స్ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా థియేటర్స్ లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను కూడా మెప్పించి భారీ విజయం అందుకుంది.
ఈ నెల 23న సినిమా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మైత్రి నిర్మాతలు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. రేపు ఈవెంట్ ఎక్కడా అనేది చెప్పానున్నారు. హైదరాబాద్ లేదా వంద రోజులు ఆడుతున్న ప్లేస్ లో ఈవెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
వీర సింహా రెడ్డి కొన్ని సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజులు మరికొన్ని థియేటర్స్ లో షిఫ్టింగ్ తో వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఎన్ని థియేటర్స్ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓటీటీ , డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో థియేటర్స్ లో వంద రోజులు ఆడటం అంటే గొప్ప విషయమే. బాలయ్య నటించిన అఖండ కూడా వంద రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడింది. ఆ సినిమాకు కర్నూల్ లో గ్రాండ్ గా వంద రోజుల వేడుక చేశారు. ఇప్పుడు అదే రీతిలో వీర సింహా రెడ్డి 100 డేస్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు సార్లు 100 రోజుల వేడుక జరుపుకున్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డ్ నెలకొల్పనున్నాడు.
This post was last modified on April 18, 2023 10:12 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…