కెరీర్ ఆరంభంలో రామ్ చరణ్ చేసిన ‘ఆరెంజ్’ అనుకున్నంత విజయం సాదించలేదు. దీంతో అప్పట్లో ఈ సినిమాను నిర్మించిన నాగబాబు భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఒక టైమ్ లో సూసైడ్ కూడా చేసుకోబోయనని ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అయితే తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీ రీలీజ్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ కి రావడంతో 3 కోట్లకు పైగా కొల్లగొట్టి రికార్డ్ నెలకొల్పింది ఆరెంజ్.
ఈ సినిమా ఇటీవలే రీ రిలీజ్ లో అద్భుత విజయం సాదించిన సందర్భంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా తెరవెనుక కథలు అనే షోలో పాల్గొన్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆరెంజ్ రిలీజ్ తర్వాత తనతో చెప్పిన మాటలను పంచుకున్నాడు. ” పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజయిన కొన్ని రోజుల తర్వాత ఒక విషయం చెప్పారు. నువ్వు కథ చెప్పినప్పుడు నాకు నచ్చింది, సినిమా చూసినప్పుడు నాకు నచ్చింది. ఆడటం ఆడకపోవడం అనేవి జరుగుతుంటాయి. నాకు కూడా జానీ విషయంలో జరిగింది. ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్ లో అయిపోయింది. మైండ్ లోకి తీసుకోకు. నువ్వు సుపీరియర్ రైటర్ … వెళ్ళి ఇంకో కథ రాయి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అన్నారు” అంటూ తనతో పవన్ చెప్పిన విషయాన్ని షేర్ చేసుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్.
ఇక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ గురించి నాకు చెప్పింది బన్నీ అంటూ చెప్పాడు భాస్కర్. పరుగు షూటింగ్ టైమ్ లో బన్నీ ఆ గేమ్ గురించి చెప్తుంటే అప్పటి నుండి మైండ్ లో పడిందని , ఆరెంజ్ లో ఆ గేమ్ సీన్ అందుకే పెట్టానని ఈ సందర్భంగా బన్నీ కి థాంక్స్ చెప్పాలి అంటూ భాస్కర్ అన్నాడు.