Movie News

అఖిల్ మీద 80 కోట్ల భారం

అక్కినేని అఖిల్‌‌కు హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్‌’ ముంగిట వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో డెబ్యూ హీరోకు సంబంధించి అనేక రికార్డులను నెలకొల్పాడు ఈ అక్కినేని కుర్రాడు. బడ్జెట్, ఓపెనింగ్స్ సహా అనేక విషయాల్లో నంబర్స్ చూసి ఔరా అనుకున్నారు. ఒక సూపర్ స్టార్ అవతరించబోతున్నాడనే అంచనాలు కలిగాయి. కానీ సినిమా చూశాక ఆ అంచనాలన్నీ తుస్సుమన్నాయి. ‘అఖిల్’ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను సైతం నిరాశ పరిచాయి. కానీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడి అతడికి ఉపశమనాన్ని అందించింది.

ఐతే ఎలాగైతేనేం ఒక సక్సెస్ ఫుల్ మూవీ పడటంతో నిర్మాత అనిల్ సుంకర అఖిల్‌తో పెద్ద సాహసానికి రెడీ అయిపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమాను అనౌన్స్ చేశాడు. దీని బడ్జెట్ రూ.50 కోట్లని సినిమా మొదలైన కొత్తలో వార్తలు వస్తే అందరూ అవాక్కయ్యారు.

అఖిల్‌కు తొలి సక్సెస్ అందించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అన్ని రకాలుగా కలిపి పాతిక కోట్లకు అటు ఇటుగా ఆదాయం తెస్తే.. తర్వాతి చిత్రానికి ఏకంగా డబుల్ బడ్జెట్ ఏంటి అనుకున్నారు. కానీ ఈసారి అఖిల్ చేస్తోంది మాస్ మూవీ, పైగా సురేందర్ రెడ్డి దర్శకుడు కాబట్టి ఎలాగోలా వర్కవుట్ చేస్తారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాత అనిల్ బడ్జెట్ గురించి చెబుతున్న విషయాలు షాకిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని 80 కోట్ల బడ్జెట్లో తీసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఖర్చు అంతకంటే మించి కూడా అయ్యుండొచ్చని కూడా అన్నారు. కానీ అఖిల్‌ను నమ్మి మరీ అంత బడ్జెట్ పెట్టడమేంటి అన్నది జనాలకు అంతుబట్టడం లేదు. సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ మొత్తం రికవరీ అసాధ్యం అనే అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఆశించిన బజ్ కూడా లేదు. మరి ఇంత భారాన్ని అఖిల్ ఎలా మోస్తాడు.. సినిమాను ఎలా బయటపడేస్తాడు అన్నది చూడాలి.

This post was last modified on April 18, 2023 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

3 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

50 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

50 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

5 hours ago