ఈ రోజుల్లో సినిమా ఎలా ఉన్నా సరే.. చివర్లో సీక్వెల్ మీద హింట్ ఇవ్వడం మామూలైపోయింది. రిజల్ట్ తేడా కొట్టినా కూడా ముందే ప్రకటించిన ప్రకారం రెండో భాగం తీయడానికి రెడీ అయిపోతున్నారు. ఇటీవలే కన్నడ సినిమా ‘కబ్జ’ ప్రేక్షకులకు తలపోటు తెప్పించింది. కానీ సినిమా చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రతి విషయంలోనూ ‘కేజీఎఫ్’ను అనుకరించిన ఈ చిత్ర మేకర్స్.. రెండో పార్ట్ తీసే విషయంలోనూ దాన్నే ఫాలో అయిపోయారు.
సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైనా సరే.. సీక్వెల్‌కు కట్టుబడి ఉన్నారు. ఇటీవలే షూటింగ్ కూడా మొదలైంది. తెలుగులో ఇంతకుముందు ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ డిజాస్టర్ అయినా సరే.. ఇక తప్పక రెండో భాగం విషయంలో ముందుకు వెళ్తే చేదు అనుభవం తప్పలేదు. ఇలాగే ఇప్పుడు విశ్వక్సేన్ సైతం సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటున్నాడు.
విశ్వక్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఒక మోస్తరుగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. విశ్వక్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్, అగ్రెసివ్ ప్రమోషన్ల వల్ల ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా చూస్తే ఇది ఫ్లాప్ మూవీనే. ఐతే ఆ సినిమా చివర్లో ‘దాస్ కా ధమ్కీ-2’ ఉంటుందని హింట్ ఇచ్చిన విశ్వక్.. ఆ సినిమా తీయడానికే రెడీ అయ్యాడు.
ఈ సినిమా ఆహా ఓటీటీలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంటున్న నేపథ్యంలో విశ్వక్ హీరోయిన్ నివేథా పెతురాజ్‌తో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. సీక్వెల్‌కు స్క్రిప్టు రెడీ అవుతోందని.. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే పది రెట్లు మిన్నగా ఈ సినిమా ఉంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. కానీ ‘దాస్ కా ధమ్కీ’నే మెప్పించనపుడు దాన్ని మించి సీక్వెల్ పది రెట్లు ఉండటం ఏంటి అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ.. నిజంగా సీక్వెల్ విషయంలో విశ్వక్ ముందుకు వెళ్తాడా అన్నది డౌట్.
This post was last modified on April 18, 2023 5:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…