జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీలో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు హైదరాబాద్ షెడ్యూల్ లో అతనే అడుగు పెట్టేయడంతో అన్ని పుకార్లకు చెక్ పడిపోయింది. ముందు ఒప్పుకుని తర్వాత డ్రాప్ అయ్యాడని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ ఫైనల్ గా అవన్నీ ఉత్తివేనని తేలింది. హీరొయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ కూడా ఇప్పుడు జరుగుతున్న షూట్ తోనే స్టార్ట్ అయిపోయింది. చాలా కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు కొరటాల పకడ్బందీగా షూట్ చేస్తున్నారు.
ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ద్వారా అఫీషియల్ గా బయటికి వచ్చేయడంతో విలన్ కు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. అయితే పాత్ర తాలూకు ఎలాంటి క్లూస్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది. సముద్రం నేపథ్యంలో ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొరటాల దీన్ని రూపొందిస్తున్నారు. అసలే ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలను దీంతో పూర్తిగా తుడిచేయాలనే కసితో ఉన్నారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ కోసమే ఏడాదికి ప్[పైగా విలువైన సమయాన్ని త్యాగం చేసిన కొరటాల, జూనియర్ లు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక సైఫ్ విషయానికి వస్తే ఆది పురుష్ తర్వాత ఇది తనకు తెలుగు హీరోతో రెండో సినిమా. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కౌంట్ ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ 30నే డెబ్యూ అవుతుంది. ప్రభాస్ ది హిందీలో అది కూడా యానిమేషన్ టెక్నాలజీ వాడారు కాబట్టి మనమిక్కడ డబ్బింగ్ వెర్షన్ లోనే చూడాల్సి ఉంటుంది. సో సైఫ్ మొదటి చిత్రంగా తారక్ దే చెలామణి అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. రిలీజ్ కు ఇంకో సంవత్సరం టైం ఉన్నప్పటికీ కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టారు.
This post was last modified on April 18, 2023 11:26 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…