ఒక నిర్మాణ సంస్థ 30 సినిమాలు పూర్తి చేస్తేనే ఆశ్చర్యపోయే రోజులు ఇవి. అలాంటిది ఒక సంస్థలో 30 సినిమాల దాకా ప్లానింగ్‌లో ఉన్నాయి అంటే షాకవ్వక తప్పదు. కొన్నేళ్ల నుంచి ట్రెండును గమనిస్తే.. కొంచెం అగ్రెసివ్‌గా సినిమాలు తీసి.. ఆ తర్వాత కనుమరుగు అయిపోతున్న ప్రొడక్షన్ హౌస్‌లు చాలానే కనిపిస్తాయి. సినిమాల నిర్మాణం పూర్తిగా జూదం లాగా మారిపోయి.. కాంబినేషన్ల మీద ఆధారపడి సినిమాలు తీసే ప్రస్తుత కాలంలో నిలకడగా విజయాలు అందుకుని.. దీర్ఘ కాలం నిలిచే సంస్థలు తగ్గిపోతున్నాయి.
ఇలాంటి టైంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో దాదాపు 30 సినిమాల దాకా ప్లానింగ్‌లో ఉన్నాయన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సంస్థ మొదట్లో కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. చిన్న స్థాయి సినిమాలే నిర్మించింది. ఫలితాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి.
కానీ గత ఏడాది ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. తర్వాత కొన్ని నెలలకే ‘ధమాకా’ రూపంలో మరో జాక్‌పాట్ తగిలింది. దీంతో ఈ సంస్థ దూకుడు బాగా పెరిగింది. ఇప్పుడు ఇద్దరు టాప్ స్టార్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ తమ సంస్థను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లే పనిలో ఉన్నారు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతో పాటు.. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘వినోదియ సిత్తం’ రీమేక్ పీపుల్స్ మీడియా బేనర్లో తెరకెక్కతున్నవే. ఇక మే తొలి వారంలో రానున్న ‘రామబాణం’ ఈ సంస్థ సినిమానే. ఇవి పైకి కనిపిస్తున్నవి కానీ.. ఇంకా అనౌన్స్ కాకుండానే సైలెంటుగా సెట్స్ మీదికి వెళ్లినవి.. ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్నవి.. కథా చర్చల్లో ఉన్నవి.. ఇలా ఈ సంస్థలో చాలా సినిమాలే వరుసలో ఉన్నాయట. అన్నీ కలిపితే నంబర్ 30 దాకా ఉంటుందని టాక్. ఒక సంస్థ కాస్త అటు ఇటుగా ఒకే టైంలో ఇన్ని సినిమాలు ప్లాన్ చేయడం ఒక రికార్డేమో.
This post was last modified on April 18, 2023 8:36 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…