తెలుగు దర్శకులకు వేరే ఫిలిం ఇండస్ట్రీల్లోనూ ఇది వరకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది గత కొన్నేళ్లలో. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల హీరోలూ టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య తమిళ హీరోలు.. వరుసగా తెలుగు దర్శకులతో జట్టు కడుతున్నారు.
శివ కార్తికేయనేమో అనుదీప్‌తో ‘ప్రిన్స్’ చేస్తే.. వెంకీ అట్లూరితో ధనుష్ ‘సార్’ చేశాడు. అలాగే విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ మూవీలో నటించాడు. ధనుష్.. శేఖర్ కమ్ములతోనూ జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా కొందరు తమిళ హీరోలు తెలుగు దర్శకుల వైపు చూస్తున్నారు. ఇందులో కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య కూడా ఉన్నట్లు తాజా సమాచారం. తెలుగులో సూర్యకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉండేదో తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్‌ల తర్వాత అంత ఫాలోయింగ్ సంపాదించింది సూర్యనే.
ఐతే గత కొన్నేళ్లలో సూర్య సరైన సినిమాలు అందించకపోవడం వల్ల తెలుగులో మార్కెట్, క్రేజ్ పడిపోయింది. అయినప్పటికీ అతడిని అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిని మెప్పించడంతో పాటు తమిళంలోనూ మంచి విజయం అందుకునే దిశగా ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడట.
ఇందుకోసం అతను ‘కార్తికేయ-2’ దర్శకుడు చందూ మొండేటితో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. చందూ ‘కార్తికేయ-2’లో పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయాన్నందుకున్నాడు. సరైన స్టార్ పడితే అతడి తర్వాతి చిత్రం వేరే లెవెల్‌కు వెళ్తుందనడంలో సందేహం లేదు. అందుకే అతను సూర్యకు ఒక కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మొదట్నుంచి సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న ఫాంటసీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చందూ. సూర్యకు కూడా ఈ తరహా సినిమాలంటే ప్రత్యేక ఆసక్తి ఉంది. వీరి కలయికలో ఈ జానర్లో మంచి సినిమా పడితే ప్రేక్షకులకు పండగే.
This post was last modified on %s = human-readable time difference 6:15 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…