అక్కినేని నాగచైతన్య కెరీర్ ఆరంభం నుంచి కూడా ఒడుదొడుకులతోనే సాగుతోంది. ‘జోష్’ లాంటి ఫ్లాప్ మూవీతో కెరీర్‌ను ఆరంభించిన అతను.. ఆ తర్వాత ‘ఏమాయ చేసావె’తో హిట్టు కొట్టాడు. కానీ మళ్లీ తడబడ్డాడు. ఒకట్రెండు పెద్ద హిట్లు కొట్టడం.. ఆ తర్వాత అదే స్థాయిలో డిజాస్టర్ ఖాతాలో వేసుకోవడం ఇదీ వరస. ముఖ్యంగా అతను ప్రేమకథలతో సక్సెస్‌లు సాధించి.. ఆ తర్వాత మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాడు. చివరగా అతను చేసిన ‘థాంక్యూ’ సినిమా తీవ్ర నిరాశకే గురి చేసింది.
త్వరలో అతను ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని అక్కినేని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమాల సంగతి ఇలా ఉంటే.. చైతూ ‘దూత’ అనే వెబ్ సిరీస్‌ను రెండేళ్ల కిందటే మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాని సంగతే ఏమీ తెలియట్లేదు.
‘థాంక్యూ’ సినిమా మేకింగ్ దశలో ఉండగా.. ‘దూత’కు మంచి బజ్‌యే కనిపించింది. ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నది విక్రమ్ కుమార్ కావడం.. అప్పటికే చైతూ, ఆయన కలయికలో మనం సినిమా వచ్చి ఉండటం.. దూత అనే టైటిల్, దీనికి సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమో కూడా బాగుండటంతో బజ్ బాగానే కనిపించింది. ఈ సిరీస్‌ను గత ఏడాదే రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ ఏమైందో ఏమో.. తర్వాత అతీ గతీ లేదు. గత ఏడాది ఈ సమయానికే ‘దూత’ మేకింగ్ చివరి దశలో ఉందన్నారు. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. రిలీజ్ సంగతి పక్కన పెడితే.. దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు.
అమేజాన్ ప్రైమ్ వాళ్లు ఒక డెడ్ లైన్ పెట్టి ఒరిజినల్స్ పూర్తి చేయిస్తుంటారు. కానీ ఈ సిరీస్ విషయంలో వాళ్లెందుకు సైలెంటుగా ఉన్నారో తెలియట్లేదు. ఇలా ఆలస్యం అయ్యే ఏ సినిమా అయినా, సిరీస్ అయినా ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ‘దూత’ను ప్రేక్షకుల ముందుకు తెస్తే బెటర్.
This post was last modified on April 15, 2023 5:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…