నెలల తరబడి ముందే బాక్సాఫీస్ క్లాషులు రెడీ అవుతున్నాయి. విడుదల తేదీలు లాక్ చేసుకోకపోతే వచ్చే సమస్యలను గుర్తించి నిర్మాతలు అడ్వాన్సవుతున్నారు. ఇటీవలే దసరాతో మాస్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమాలో ఓ పాప తండ్రిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ధరణిగా చేసిన వయొలెంట్ పాత్రకు పూర్తిగా భిన్నంగా ఇది ఉండబోతోంది. షౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. హేశం అబ్దుల్ వాహాబ్ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇప్పుడీ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీని ముందు వెనుక గట్టి పోటీ ఉంది. 22న విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ ఎప్పుడో లాక్ చేసుకుంది. దానికన్నా ఒక రోజు ముందు నాని సిద్ధపడుతున్నాడు. ఇక్కడితో అయిపోలేదు. నాని వచ్చే రోజే ‘ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్ డం’ ఉంటుంది. ఓవర్సీస్ లో దీని క్రేజ్ ముందు పోరాడాలంటే చాలా కష్టపడాలి. షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీలా క్రేజీ మూవీ ‘డుంకి’ 22న రావడం ఖాయమే.
ఇవి కాకుండా అక్షయ్ కుమార్ టైగర్ శ్రోఫ్ ల ‘బడే మియా చోటే మియా’ను తక్కువ అంచనా వేయడానికి లేదు. నాని 30 ప్రధానంగా పోటీలోకి తీసుకోవాల్సింది సైంధవ్, ఆక్వామెన్, డుంకిలనే. సంక్రాంతికి ఆల్రెడీ విపరీతమైన పోటీ నెలకొనడంతో సంవత్సరం చివర్లో వచ్చేందుకు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఫ్యామిలీ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వస్తున్న నానికి ఈ మూవీ కంప్లీట్ మేకోవర్ లా నిలవనుంది. ఇంకా ఎనిమిది నెలలకు పైగా టైం ఉంది కాబట్టి షూటింగ్ పూర్తయ్యే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో 2023లో న్యాచురల్ స్టార్ వి రెండు సినిమాలే.
This post was last modified on April 15, 2023 5:51 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…