భారతీయ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన మాస్ సినిమాల్లో కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. భాష, ప్రాంత భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులకూ ఈ సినిమా తెగ నచ్చేసింది. కేజీఎఫ్-1, 2 రెండూ కూడా డివైడ్ టాక్‌ను తట్టుకుని తిరుగులేని బ్లాక్‌బస్టర్లు అయ్యాయి.
గత ఏడాది ఇదే సమయంలో రిలీజైన కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఈ సినిమా చివర్లో కేజీఎఫ్-3 గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత దీని గురించి ఎలాంటి చర్చ లేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. సలార్-2కు సీక్వెల్ కూడా వస్తుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తోనే మరో సినిమా కూడా ఉంటుందంటున్నారు.
ఇన్ని సినిమాల మధ్య కేజీఎఫ్-3 అసలుంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. కానీ ఈ సందేహాలకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ చెక్ పెట్టింది. కేజీఎఫ్-3 కచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ.. ఈ సినిమా కథ విషయంలోనూ ఒక హింట్ ఇచ్చింది. కేజీఎఫ్-2 వార్షికోత్సవం నేపథ్యంలో హోంబలె ఫిలిమ్స్ ట్విట్టర్లో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
రాకీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నాడు అని అందులో ప్రశ్న లేవనెత్తింది. ఇది కేజీఎఫ్-3 కథకు సంబంధించిన హింట్ అని భావిస్తున్నారు. ప్రశాంత్ ఎప్పుడు సినిమా చేస్తాడో కానీ.. ఆ మూడేళ్లలో రాకీ ఏం చేశాడు అనే నేపథ్యంలోనే ఈ సినిమాను నడిపిస్తాడన్నది స్పష్టం. కేజీఎఫ్-2లో బంగారంతో పాటే రాకీ సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపిస్తారు. కానీ అక్కడి నుంచి తప్పించుకున్నాక రాకీ జర్నీని చాప్టర్-3లో చూపిస్తారన్నమాట.
This post was last modified on April 14, 2023 4:26 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…