అల్లరితో దర్శకుడిగా ప్రయాణాన్ని విభిన్నంగా మొదలుపెట్టిన రవిబాబు ఈ మధ్య కనిపించడం బాగా తగ్గిపోయింది. తండ్రి చలపతిరావు మరణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ దర్శనమిస్తున్నాడు. ఇటీవలే పెయిడ్ ఓటిటిలో దిగిన ఈటీవీ విన్ నిర్మించిన అసలుతో మళ్ళీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అయితే ఈసారి కేవలం నటనకే పరిమితమై కథ, మాటలు, నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యత తీసుకుని డైరెక్షన్ ఉదయ్-సురేష్ లకు అప్పగించాడు. ఇది ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ కొంత ఆసక్తికరంగా అనిపించడంతో ఓమాదిరి బజ్ వచ్చింది.
ఫారెన్సిక్ ప్రొఫెసర్ చక్రవర్తి(సూర్య) ఆన్ లైన్ క్లాసులు చెబుతుండగా జూమ్ కెమెరాల సాక్షిగా హత్య చేయబడతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన సిఐడి ఆఫీసర్ రంజిత్ రావు(రవిబాబు) నలుగురు అనుమానితులను తీసుకుని విచారిస్తాడు. చక్రవర్తి దగ్గరే అసిస్టెంట్ పని చేసిన వందన(పూర్ణ) తండ్రి లాంటి వ్యక్తి పోయినందుకు తల్లడిల్లుతుంది. అయితే విచారణ కొనసాగే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడతాయి. చంపిన వాడి తాలూకు క్లూస్ దొరక్క ఇబ్బందిపడుతున్న టైంలో వందన గుంటూరు వెళ్ళడంతో కథ మలుపు తిరుగుతుంది. అదే అసలు సస్పెన్స్.
గంట నలభై రెండు నిమిషాల నిడివితో పాటలు లేకుండా వీలైనంత సాగతీత రాకుండా రవిబాబు జాగ్రత్త పడ్డాడు. ఇతనే ఇందులో హీరో. చివరి దాకా క్రైమ్ ఎలిమెంట్ ని బాగానే మైంటైన్ చేశారు. కొన్ని లాజిక్స్ నమ్మశక్యంగా లేనప్పటికీ ఓవరాల్ గా కథనంతో పర్వాలేదనిపించారు. మెయిన్ ప్లాట్ తాలూకు నేపధ్యాన్ని, ఫ్లాష్ బ్యాక్ ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సబ్జెక్టులతో గతంలోనూ చాలానే వచ్చాయి కాబట్టి మరీ ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుండా చిన్న మూవీ కాబట్టి లాగించేయొచ్చు. రెండో భాగంకి అవసరమైన ట్విస్టు చివర్లో వదిలారు.
This post was last modified on April 13, 2023 4:01 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…