2000 సంవత్సరానికి అటు ఇటు తెలుగు, తమిళ సినిమాలను బాగా ఫాలో అయిన వాళ్లు సిమ్రాన్‌ను అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు.. తమిళంలో కమల్ హాసన్, విజయ్, అజిత్.. ఇలా ఎంతోమంది టాప్ స్టార్లతో సినిమాలు చేసి.. తిరుగులేని స్టార్ స్టేటస్ సంపాదించింది ఈ పంజాబీ భామ.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో దీపక్ బగ్గా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి కొంత కాలం సినిమాలకు దూరం అయిపోయిన ఆమె.. ఆపై క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోయింది. కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో నటిగా మంచి పేరు సంపాదించిన ఆమె.. ఇప్పుడు కూడా కోలీవుడ్లో కొంచెం బిజీగానే ఉంది. ఇప్పుడు సిమ్రాన్ తన కొడుకును హీరోగా పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
2003లో దీపక్‌ను పెళ్లాడిన కొంత కాలానికే కొడుకును కంది సిమ్రాన్. ఆ కొడుకు ఇప్పుడు టీనేజీ చివరి దశలో ఉన్నాడు. తన పేరు.. అదీప్. సిమ్రాన్ కొడుకు ఫొటోలు ఇంత కాలం సోషల్ మీడియాలోకి కూడా రాలేదు. ఐతే ఇప్పుడు అతడి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే హీరోలా ఉన్నాడే అనిపించేలా ఉంది తన లుక్. టీనేజీ ఛాయలు ఇంకా పోలేదు కానీ.. ఒకట్రెండేళ్లు ఆగితే ఇంకా మంచి లుక్‌లోకి వస్తాడనడంలో సందేహం లేదు.
సిమ్రాన్‌తో పాటు ఆమె భర్త కూడా పొడగరులు కావడంతో అదీప్ కూడా ఆజానుబాహువులాగే కనిపిస్తున్నాడు. తన కొడుకును హీరోను చేయడానికి సిమ్రాన్ సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకే తన ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి జనాల రెస్పాన్స్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళంలోనే సిమ్రాన్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడే తన కొడుకును హీరోగా చేసే అవకాశముంది.
This post was last modified on April 13, 2023 3:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…