ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ లేవు. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి పుష్ప యూనిట్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం.. ఆ ప్రచారం కొంచెం బయటికి కూడా రావడం గమనార్హం.
పుష్పను ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో ఆ కథను విస్తరించి రెండు భాగాలు చేశాడు సుకుమార్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చిత్రీకరణ మధ్యలో ఉండగా.. ఆయనకు మూడో భాగం మీద మనసు మళ్లినట్లు చెబుతున్నారు. పుష్ప పాత్ర జనాలకు విపరీతంగా ఎక్కేసిన నేపథ్యంలో ఆ పాత్రను రెండో భాగంతో వదిలేయకూడదని.. కథను మరి కాస్త పొడిగించి భవిష్యత్తులో మూడో భాగం కూడా తీయాలనే చర్చ సుకుమార్ అండ్ టీంలో నడుస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది.
పుష్ప-2లో అయితే మూడో పార్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదులుతారని.. భవిష్యత్తులో కుదిరితే మూడో భాగం తీస్తారని అంటున్నారు. ఈ ప్రచారం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
This post was last modified on April 13, 2023 10:30 am
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…
జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు శనివారం కూడా.. పిఠాపురంలో పర్యటించారు. శుక్రవారం పిఠాపురానికి వెళ్లిన ఆయన..…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేసవి కాలం ప్రారంభం అయిన నేపథ్యంలో సాగు, తాగు నీటి…