Movie News

సమంత ఆరోగ్యం ఏమైంది ?

సమంతను శకుంతలదేవి గా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజవుతుంది. ఈ సినిమా కోసం సమంత తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొంది. ముంబై , కొచ్చి ఇలా అన్నీ ప్రెస్ మీట్స్ కి హాజరైంది. ముఖ్యంగా ఎల్ బీ స్టేడియం ఈవెంట్ కి ఆమెను టీం వద్దని చెప్పినా వినకుండా ప్రమోషన్ కోసం అక్కడికి కూడా వెళ్ళింది. దీంతో సామ్ ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది.

వరుస టూర్లు , ప్రమోషన్స్ , మీడియా ఇంట్రాక్షన్స్ ఇలా అన్నిటిలో పాల్గొన్నాక సమంత కి తీవ్ర జ్వరం వచ్చింది. ముఖ్యంగా దగ్గుతో పెద్దగా మాట్లాడలేకపోతుందని తెలుస్తుంది. తాజాగా జరిగిన తెలుగు ప్రెస్ మీట్ లో కూడా సామ్ మధ్యలో దగ్గుతోనే ఉంది. ఇక ఈరోజు డిల్లీలో బీజేపీ నాయకుల కోసం శాకుంతలం ప్రీమియర్ షో వేస్తున్నారు. అక్కడికి సామ్ వెళ్లాల్సి ఉంది కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో వెళ్లలేకపోయింది.

తాజాగా తన ఆరోగ్యం బాలేదని , ఫీవర్ తో మాట్లాడలేకపోతున్నాని అందుకే శాకుంతలం మిగతా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాని సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పుకుంది. దీంతో అభిమానులు సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యమని సమంత కి చెప్తూ రెస్ట్ తీసుకోమని రిప్లైలు పెడుతున్నారు. శాకుంతలం సక్సెస్ సమంతకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్టయితే సమంతతో ఈ తరహా కథలు తీసేందుకు ఇంకొందరు దర్శక నిర్మాతలు ముందుకొస్తారు. మరి శాకుంతలంతో సమంత ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

This post was last modified on April 12, 2023 4:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ చేస్తోంది లోకేష్ డ్రీమ్ ప్రాజెక్టా ?

అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…

37 minutes ago

ఆర్కే ఏమ‌య్యారు… వైసీపీలో హాట్ టాపిక్ ..?

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌గానే ఠ‌క్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వ‌స్తున్నారు. నియోజ‌క వర్గంలో చేప‌డుతున్న ప‌నులు కావొచ్చు..…

2 hours ago

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…

3 hours ago

బన్నీతో లోకీ – అడవిలో అరాచకం ?

గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…

4 hours ago

షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్

చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…

5 hours ago

అన్నగారు తప్పుకోవడమే మంచిదయ్యింది

తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…

5 hours ago