హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఏదైనా పాత్ర చేయమంటే కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరూ అంగీకరించరు. తమను డమ్మీని చేసేస్తారేమో అని, స్థాయి తగ్గిపోతుందేమో అని ఫీలవుతుంటారు. కానీ కొద్దిమంది హీరోలు మాత్రమే ఇలాంటి భేషజాలేమీ పెట్టుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా దగ్గుబాటి ఆమెకు జోడీగా కనిపించి మెప్పిస్తే.. అందులో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రతో మెరిశాడు. కానీ ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ తీసిన తర్వాతి సినిమా ‘శాకుంతలం’కి మాత్రం అలా స్టార్ల బలం తోడవలేదు.
ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్ర కోసం తెలుగు స్టార్లు కొందరిని సంప్రదించాడట గుణశేఖర్. కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోవడంతో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇటీవల ‘శాకుంతలం’ ప్రిమియర్ చూసిన చాలామంది ఎవరైనా స్టార్ హీరో దుష్యంతుడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మీడియా వాళ్లు కూడా ఇదే విషయమై గుణశేఖర్‌ను ప్రశ్నిస్తే.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
“రుద్రమదేవి సినిమాను మొదలు పెట్టినపుడు అందులో అల్లు అర్జున్ లేడు. మధ్యలో వచ్చి ఆ సినిమాలో చేరాడు. గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పగానే ఒక్క మాట ఆలోచించకుండా ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ పాత్ర అంత బాగా పండింది. సినిమాకు ఉపయోగపడింది. హీరోలు ఇమేజ్ గురించి ఆలోచించకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలి. దుష్యంతుడి పాత్ర కోసం తెలుగులో కొందరు స్టార్ హీరోలను అడిగాం. కానీ ఎవ్వరూ చేయకపోవడంతోనే దేవ్ మోహన్‌ను తీసుకున్నాం. అతను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు” అని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 12, 2023 4:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…