ఆస్కార్ విజేత కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీ మత్తు వదలరా హిట్టయ్యాక కుర్రాడికి టైం అట్టే కలిసి రాలేదు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త రెండూ దారుణంగా డిజాస్టరయ్యాయి. మార్కెట్ పరంగా ఇంకా ఎలాంటి ఇమేజ్ సంపాదించుకోనప్పటికీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వాటిలో భాగంగా వస్తున్నదే ఉస్తాద్. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించారు.
ఇవాళ టీజర్ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఎత్తు అంటే భయపడే పిల్లాడి(శ్రీసింహా) జీవితంలో ఎప్పటికైనా విమానం నడిపే పైలట్ కావాలనే లక్ష్యం ఉంటుంది. కానీ పేదరికం, చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించవు. స్కూటర్లలో వాడే మోటార్ల మీద మంచి పనితనం ఉన్న ఇతగాడు అసలు పనికేరాదనుకున్న డొక్కు బులెట్ ని సరిచేసి వాడుకుంటాడు. ఓ అమ్మాయి(కావ్య కళ్యాణ్ రామ్) ప్రేమలో పడతాడు. క్రమంగా తాను కోరుకున్న లక్ష్యం వైపు ప్రయాణించి ఏరోప్లేన్ నడిపే స్థాయికి చేరుకుంటాడు. అయితే ఎన్నో సవాళ్లు ప్రమాదాలు చుట్టుముడతాయి.
బయోపిక్ షేడ్స్ లో సాగే నెరేషన్ తో ఫణిదీప్ మంచి భావోద్వేగాలతో ఈ ఉస్తాద్ ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. పవన్ కుమార్ ఛాయాగ్రహణం, అకీవా సంగీతం బాగున్నాయి. అయితే సూర్య ఆకాశం నీ హద్దురా తరహా ఛాయలు కొన్ని కనిపించినా టేకింగ్ లో ఫ్రెష్ నెస్ అయితే ఉంది. గౌతమ్ మీనన్, రవీంద్ర విజయ్ లాంటి సీనియర్లు ఇతర తారాగణం. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని ఈ ఎమోషనల్ డ్రామా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో సగం టైటిల్ వాడేసుకున్న శ్రీసింహకు ఇది బ్రేక్ ఇచ్చేలానే ఉంది.
This post was last modified on April 12, 2023 10:49 am
పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్…
పిఠాపురం వర్మగా పేరొందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
అరుంధతి విలన్ సోను సూద్ స్వీయ దర్శకత్వంలో తీసిన ఫతే నిన్న విడుదలయ్యింది. గేమ్ ఛేంజర్ హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్లోని…
హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…