పెద్ద సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్లు అంటే ఫారిన్లో మంచు ప్రదేశాలకు వెళ్లిపోతుంటుంది యూనిట్. మంచు కురుస్తున్న బ్యాగ్రౌండ్లో రొమాంటిక్ సాంగ్స్ తీస్తే ప్రేక్షకులకు మంచి కిక్ వస్తుందని భావిస్తారు. ఐతే ఈ పాటల్లో చాలా వరకు హీరోలు కోట్లు, సూట్లు వేసుకుని కనిపిస్తే.. హీరోయిన్లు మాత్రం కురచ దుస్తుల్లో అందాలు ఆరబోస్తుంటారు. అంత చలిలో వాళ్లు చాలా ఆనందంగా గెంతులేస్తున్నట్లు కనిపించాల్సి ఉంటుంది. హీరోయిన్లను ఇలా చూపించడం పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.
హీరోయిన్లు సైతం ఈ విషయంలో తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సైతం ఈ విషయంలో అలాగే మాట్లాడింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు మంచు అంటే అస్సలు పడదని శ్రుతి వెల్లడించింది. చలికి అస్సలు తట్టుకోలేనని.. ఐతే సినిమాల్లో భాగంగా చాలాసార్లు మంచు ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటల్లో నర్తించాల్సి వచ్చిందని శ్రుతి చెప్పింది. ఇలాంటి పాటలు తీసినపుడు హీరోలకు మాత్రం కోట్లు వేస్తారని.. హీరోయిన్లు మాత్రం కురచ దుస్తుల్లో కనిపించాల్సి ఉంటుందని.. ఇది అన్యాయమని శ్రుతి అంది. తాను దర్శకులందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నానని.. ఇలా ఎవ్వరూ చేయొద్దని.. మంచులో పాటలు తీసేటపుడు హీరోయిన్లకు కూడా హీరోల్లాగే కోట్లు వేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరింది.
ఈ ఇంటర్యూలో శ్రుతి ఇలా చెప్పగానే.. వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి పాటకు సంబంధించి విజువల్స్ వేశారు. అందులో చిరు కోటుతో కనిపించగా.. శ్రుతి చీరలో కనిపించింది. ఐతే శ్రుతి జనరల్‌గానే ఈ విషయం చెప్పినప్పటికీ.. ఈ వీడియో చూసి చిరు ఫ్యాన్స్ కొందరు శ్రుతి మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on April 11, 2023 9:38 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…