మాములుగా సల్మాన్ ఖాన్ సినిమా అంటే బాలీవుడ్ లో అదో రకమైన పండగ వాతావరణం ఉంటుంది. అందులోనూ తను చాలా సెంటిమెంట్ గా భావించే రంజాన్ కు వస్తున్నాడంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కానీ విచిత్రంగా కిసీకా భాయ్ కిసీకా జాన్ విషయంలో మాత్రం అంత హైప్ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వెంకటేష్ , పూజా హెగ్డే లాంటి స్టార్ క్యాస్టింగ్, రామ్ చరణ్ స్పెషల్ క్యామియో ఇవేవీ పూర్తి స్థాయి బజ్ ని పెంచలేకపోయాయి. పైగా సల్మాన్ విగ్గు ఎక్కువ ట్రోలింగ్ కు గురయ్యింది. నిన్న సాయంత్రం ట్రైలర్ వదిలారు.
కంటెంట్ చూస్తే ఆరిపోయిన రెగ్యులర్ మాస్ మసాలానే కండల వీరుడు నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. అందరూ భాయ్ జాన్(సల్మాన్ ఖాన్) అని పిలిచే హీరోని ఓ అమ్మాయి(పూజా హెగ్డే) ప్రేమిస్తుంది. మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆమెది తెలంగాణ కుటుంబం. అన్నయ్య(వెంకటేష్)కి హింస అంటే అస్సలు నచ్చదు. భాయ్ కేమో శత్రువు(జగపతిబాబు) నుంచి ప్రమాదం పదే పదే వెంటాడుతుంది. పెళ్లి చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తుంటే దాన్ని చెడగొట్టేందుకు విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి జరిగే డ్రామా ఎలా ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు.
ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు ఇది కాటమరాయుడు రీమేక్ కాదు. అన్ని సౌత్ మూవీస్ ని కలిపేశారు. సీమ శాస్త్రి, విశ్వాసం, వీరం, బాషా ఇలా అన్ని మిక్స్ చేసి జ్యుస్ గా మార్చాడు దర్శకుడు ఫర్హాద్ సంజి. సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మూడు రకాలుగా డిజైన్ చేయడం మాస్ కి ప్రత్యేకంగా అనిపించొచ్చు. ఎంత రొటీన్ అయినా ఎలివేషన్లు ఎమోషన్లు సరిగ్గా కుదిరితే ఆడియన్స్ హిట్ చేస్తారు కాబట్టి ఆ కోణంలో చూస్తే కిసీకా భాయ్ కిసీకా జాన్ లో అన్ని అంశాలు ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ తర్వాత ఈద్ పండక్కు వస్తున్న సల్లు భాయ్ ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on April 11, 2023 8:18 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…