Movie News

సేల్స్‌ గర్ల్‌గా పని చేసిన క్యారెక్టర్ నటి

సినిమాలు, సీరియళ్లలో నటించడానికి ముందు ఆర్టిస్టులు కష్టాలు పడటం మామూలే. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చి.. చివరికి సినీ, టీవీ రంగాల్లో సెటిలవుతుంటారు. టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పవిత్ర జయరాంది కూడా ఇలాంటి ఆసక్తికర నేపథ్యమే. పవిత్ర జయరాం పెద్దగా చదువుకోలేదట. దీంతో కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగాలు చేసే అవకాశం కూడా లేకపోయిందని.. దీంతో హౌస్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా చిన్న చిన్న ఉద్యోగాలు చేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

ప్రస్తుతం పవిత్ర జయరాం స్టార్ మాలో బాగా పాపులర్ అయిన ‘త్రినయిని’ సీరియల్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరి కొన్ని సీరియళ్లతో పవిత్ర టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది.

తనది కర్ణాటకలోని మాండ్య అని.. తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని బెంగళూరుకు వచ్చానని.. ఐతే తాను పెద్దగా చదువుకోకపోవడంతో ఎక్కడా చెప్పుకోదగ్గ ఉద్యోగం దొరకలేదని పవిత్ర జయరాం తెలిపింది. ఆ పరిస్థితుల్లో కొన్ని రోజుల్లో ఒక హోటల్లో హౌస్ కీపర్‌గా పని చేసినట్లు ఆమె వెల్లడించింది. తర్వాత సేల్స్ గర్ల్‌గా కూడా కొంత కాలం పని చేశానని.. లైబ్రరీలో కూడా చిన్న ఉద్యోగం చేశానని పవిత్ర తెలిపింది. ఐతే ఆ పనులు చేస్తున్నపుడు ఆదాయం సరిపోక ఇబ్బందులు పడ్డానని.. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు ఒక దర్శకుడి నంబర్ ఇచ్చిందని.. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పవిత్ర చెప్పింది.

సిరిగంధం శ్రీనివాస మూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌ దగ్గర దర్శకత్వ విభాగంలో కొన్నాళ్లు పని చేశాక.. కన్నడ సీరియల్స్‌లో నటించే ఆలోచనతో ఆడిషన్స్‌కు వెళ్లానని.. కొన్నాళ్లకు ఒక సీరియల్లో ఛాన్స్ వచ్చిందని.. ఆ తర్వాత తెలుగులో ‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్లో నటించానని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని పవిత్రి తెలిపింది. ఇప్పుడు ఇంత పాపులర్ అయిన ఒక నటి.. సేల్స్ గర్ల్, హౌస్ కీపర్‌గా పని చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు.

This post was last modified on April 10, 2023 2:28 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago