అకీరానందన్ విషయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానం ఇచ్చిన తీరు పట్ల ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. పవన్ వారసుడిని దాచొద్దని అప్పుడప్పుడు చూపిస్తూ ఉండమని రిక్వెస్ట్ చేసిన అతనికి ఆవిడ బదులిస్తూ వాడు నా కొడుకు మీరు ఒకే తల్లికి పుట్టారు కదాని రివర్స్ లో కౌంటర్ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి అకీరా టాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కుర్రాడు తరచుగా హైదరాబాద్ రావడం, అడవి శేష్, సాయితేజ్ లాంటి వాళ్ళను క్రమం తప్పకుండా కలుసుకోవడం చేస్తున్నాడు.
ఒడ్డుపొడవు అన్నీ బాగుండటంతో తెరమీద చూడాలని ఫ్యాన్స్ కోరుకోవడం తప్పేమి కాదు. అయితే రేణు దేశాయ్ కోణంలో విడాకులు అయ్యాయి కాబట్టి అకీరాని తన బిడ్డగానే చూడాలని కోరుకుంటోంది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఎంత విడిపోయినా రక్త సంబంధం అనేది ఒకటుందిగా. దాన్ని కాదనలేరు. భవిష్యత్తులో అకీరా ఎప్పుడు సినిమాల్లో నటించినా అతన్ని పవన్ లెగసిని మోసేవాడిగా చూస్తారు తప్పించి ప్రత్యేకంగా వేరే ఐడెంటిటీ ఇవ్వరు. అలా చేస్తేనే తనకంటూ స్వంతంగా మార్కెట్ ఏర్పడుతుంది. తండ్రి బ్రాండ్ వాడకుండా నడవడం కష్టం.
ఏది ఏమైనా రేణు దేశాయ్ కోపంలో న్యాయముంది కానీ స్పందించే తీరులో కొంత సంయమనం ఉండాలన్నది ఒక వర్గం నుంచి వినిపిస్తున్న కామెంట్. ఇప్పటి పవన్ వీరాభిమానులంతా ఆయన చివరి కొడుకు పెద్దవ్వడం కోసం ఎదురు చూడటం లేదు. దానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. కాబట్టే అకీరాను స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు. ఇది ఎప్పుడు జరుగుతోందో ఆసలు జరుగుతుందో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ మొత్తానికి ఏదో ఒక రూపంలో రేణు దేశాయ్ తో పాటు అకీరా సైతం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూనే వస్తున్నారు.
This post was last modified on April 9, 2023 4:09 pm
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…