Movie News

ఉస్తాద్ లీకులు మొదలైపోయాయ్

పవన్ కళ్యాణ్ లీకులు సర్వసాధారణం అయిపోయాయి. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న టైంలో పవన్ నడుచుకుంటూ వెళ్లే స్టిల్ ని ఒక అభిమాని దూరం నుంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తీరా చూస్తే దానికొచ్చిన రీచ్ చూసి దర్శక నిర్మాతలు ఆ పిక్ నే టైటిల్ లోగో పక్కన వాడుకునే దాకా వెళ్ళింది. కట్ చేస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఇదే బాట పట్టింది. మాస్ గెటప్ లో డార్క్ కలర్ గళ్ళ పంచ, నల్లని చొక్క, సన్నని గెడ్డంతో సైడ్ కట్ నుంచి తీసుకున్న పిక్చర్ అప్పుడే ట్విట్టర్, ఇన్స్ టాలో తెగ తిరుగుతోంది. దీన్ని కూడా లోగోగా వాడతారో ఏంటో.

దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టోరీ వినిపిస్తోంది. పవన్ ఇప్పుడు కనిపించిన ఈ లుక్కు ఫస్ట్ హాఫ్ లో వస్తుందట. ఒరిజినల్ తేరిలో విజయ్ బేకరీ నడుపుకునే వ్యక్తిగా చూపించిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా పవన్ కి కొత్త సెటప్ పెట్టి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాయి. గబ్బర్ సింగ్ లాగే దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నట్టు తెలిసింది. దానికి తగ్గట్టే లీకులు ఉండటంతో సోసోగా ఉన్న అంచనాలు మెల్లగా పెరగడం మొదలయ్యాయి.

జూన్ లో వినోదయ సితం రీమేక్ రిలీజయ్యాక హరిహరవీరమల్లు కన్నా ముందే ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసే ప్లానింగ్ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఇంకో ఏడాదిలోపే ఎన్నికలు వస్తున్న తరుణంలో ముందు కమర్షియల్ సినిమాలు పూర్తి చేసి ఆపై వీరమల్లు లాంటి హిస్టారికల్ మూవీని వదిలితే అదో మంచి స్ట్రాటజీ అవుతుంది. సుజిత్ తో చేస్తున్న ఓజి మాత్రం ఎలక్షన్లయ్యాకే వస్తుంది. రాజకీయపరంగా ఆలోగా ఏమైనా అనూహ్య పరిణామాలు తలెత్తితే అప్పుడు దాని ప్లానింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు.

This post was last modified on April 9, 2023 1:19 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

10 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago