పుష్ప సినిమాలో మిగతా డైలాగులన్నీ ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో బన్నీని ఉద్దేశించి ఫాహద్ ఫాజిల్ చెప్పే పార్టీ లేదా పుష్ప అని అడిగే డైలాగ్ మరో ఎత్తు. పుష్ప ట్రైలర్లో బాగా హైలైట్ అయిన ఈ డైలాగ్.. జనాల్లోకి దూసుకెళ్లిపోయింది. జనాలు చాలా క్యాజువల్‌గా ఈ డైలాగ్ వాడేస్తుంటారు. తమ వాళ్లెవరైనా పార్టీ ఇవ్వాల్సిన సందర్భం వస్తే పార్టీ లేదా పుష్పా అంటుంటారు. సెలబ్రెటీలు సైతం ఈ డైలాగ్‌ను ఉపయోగించేవాళ్లే.
ఐతే తాజాగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ఈ పంచ్ డైలాగ్ పేల్చడం విశేషం. శనివారం అల్లు అర్జున్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీని బావా అని సంబోధిస్తూ పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పాడు తారక్. అందుకు బదులిస్తూ బన్నీ థ్యాంక్స్ బావా అన్నాడు. అంతే కాక నీకు నా కౌగిలింతలు అని కూడా చెప్పాడు. ఈ కామెంట్ మీద తర్వాత తారక్ స్పందించాడు. కేవలం కౌగిలింతలేనా బావా.. పార్టీ లేదా పుష్పా అని పంచ్ వేశాడు.
ఇద్దరు సూపర్ స్టార్ హీరోల మధ్య ఈ సంభాషణ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. తారక్, బన్నీ ఒకరినొకరు ఎప్పట్నుంచో బావా బావా అని పిలుచుకుంటున్నారు. బన్నీ-తారక్ మధ్య అనుబంధానికి ఇది నిదర్శనం అంటూ మ్యూచువల్ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే అదిరిపోతుందని ఆకాంక్షిస్తున్న వారూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ మధ్య మెగా హీరోలతో ఇంత సన్నిహితంగా బన్నీ లేకపోవడాన్ని తప్పుబడుతున్న వాళ్లూ లేకపోలేదు.
This post was last modified on April 8, 2023 10:47 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…