సోషల్ మీడియాలో జరిగేదంతా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఒక హీరో మరో హీరోకి పుట్టిన రోజు విషెస్ చెప్పకపోయినా , తమ హీరో ఏదో సాదించినప్పుడు మరో హీరో రెస్పాండ్ అవ్వకపోయినా అన్నీ చూస్తుంటారు. తాజాగా అలాంటి ఓ తేడాను మెగా ఫ్యాన్స్ గమనించి సోషల్ మీడియాలో చిన్న సైజ్ వార్ కి దిగారు. విషయంలోకి వెళ్తే ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటుకి ఆస్కార్ రావడం, చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు అందుకోవడంతో సోషల్ మీడియాలో అందరూ విషెస్ చెప్పారు.
అయితే బన్నీ మాత్రం చరణ్ ను సోషల్ మీడియాలో విష్ చేయలేదు. మహేష్ బాబు లాంటి హీరోలు కూడా చరణ్ కి విషెస్ చెప్పినప్పుడు అదే ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ ఎందుకు చెప్పలేదని మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ తో ఫైర్ అయ్యారు. చరణ్ బర్త్ డే పార్టీలో కూడా బన్నీ కనిపించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల మధ్య, అలాగే కుటుంబాల మధ్య దూరం పెరిగిందని అంతా అనుకున్నారు.
అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేయకపోయినప్పటికీ , రామ్ చరణ్ మాత్రం బన్నీ కి ట్విటర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పాడు. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బన్నీ విశ్ చేయడం మిస్ అయిన చరణ్ మిస్ అవ్వలేదు అదీ మా హీరో గొప్పతనం అంటూ చెప్పుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒకరికొకరు విష్ చేసుకోనంత మాత్రాన వారిద్దరి మధ్య వైరం ఉన్నట్టు కాదని మెగా కాంపౌండ్ వ్యక్తులు అంటున్నారు. ఇక బన్నీ చెప్పకపోయినా చరణ్ మాత్రం విషెస్ చెప్పి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని తేల్చి చెప్పాడు.
This post was last modified on April 8, 2023 9:23 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…