ఇర్ఫాన్ ఖాన్.. గత రెండు దశాబ్దాల్లో భారతీయ సినిమా నుంచి వచ్చిన అత్యుత్తమ నటుల్లో అగ్ర భాగాన ఉండే నటుడు. బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. హాలీవుడ్లో ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ వరల్డ్’ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించే స్థాయికి ఎదిగాడతను. ఆయన నట కౌశలం గురించి చెప్పడానికి ఎన్నో గొప్ప ఉదాహరణలున్నాయి.
చాలా తక్కువ సమయంలో ఇర్ఫాన్ లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు. అలాంటి గొప్ప నటుడు ఇటీవల.. తక్కువ వయసులోనే తుది శ్వాస విడిచాడు. క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన ఇర్ఫాన్.. అభిమానుల్ని విషాదంలో ముంచెత్తాడు.
పెద్ద స్థాయి సినీ నటులెవరైనా చనిపోతే.. ఆ నటుడి మృతి తీరని లోటు అంటుంటాం. ఈ మాట నూటికి నూరు శాతం వర్తించే నటుడు ఇర్ఫాన్ అనడంలో సందేహం లేదు. ఆయన ఉండుంటే నటనలో మరిన్ని శిఖరాలు చూసేవాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించి ఉండేవాడు.
ఇర్ఫాన్ ప్రతిభ ఏంటన్నది హాలీవుడ్ వాళ్లకు కూడా బాగా తెలుసు. అందుకే జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై లాంటి భారీ చిత్రాల్లో అతడికి అవకాశమిచ్చారు. వాటిలో ఇర్ఫాన్ నటన.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. ఆస్కార్ అకాడమీ వాళ్లకు సైతం ఇర్ఫాన్ ప్రతిభ బాగా తెలుసనడానికి వాళ్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోనే నిదర్శనం.
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా ధాటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. జనాల్లో ఆశాభావం పెంపొందించేలా అకాడమీ వాళ్లు ట్విట్టర్లో ఒక వీడియో పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల నుంచి పాజిటివిటీ పెంపొందించే సన్నివేశాలు, డైలాగులతో ఆ వీడియో రూపొందించారు. శ్వశాంక్ రిడెంప్షన్, డార్క్ నైట్, సెంట్ ఆఫ్ ఉమన్, ఇంట్ స్టెల్లార్, పారసైట్ లాంటి సినిమాల నుంచి సన్నివేశాలు చూపిస్తూ.. చివరగా ‘లైఫ్ ఆఫ్ పై’లో ఇర్ఫాన్ డైలాగ్‌తో దీన్ని ముగించారు.
మీ కథ సుఖాంతమైందనుకుంటున్నారా అని అవతలి వ్యక్తి అడిగితే.. ‘‘అది మీరు చెప్పాలి’’ అని ఇర్ఫాన్ అనే డైలాగ్ పెట్టారు. ఇర్ఫాన్ నిజ జీవితానికి అన్వయించుకునేలా ఉన్న డైలాగ్ అతడి అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. అదే సమయంలో ఆస్కార్ వాళ్లు ఇర్ఫాన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం చూసి సంతోషిస్తున్నారు.
This post was last modified on August 1, 2020 4:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…