కోలీవుడ్ లో కల్ట్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ గురించి మూవీ లవర్స్ కు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కొత్త సినిమా విడుతలై పార్ట్ 1 మొన్న మార్చి 31న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక్కడ దసరా పోటీతో పాటు థియేటర్ల లభ్యత, తెలుగు హక్కులు కొనుగోలుకు తగినంత సమయం లేకపోవడం లాంటి కారణాల వల్ల డబ్బింగ్ లేట్ అయ్యింది.ఎట్టకేలకు అల్లు అరవింద్ ముందుకు రావడంతో విడుదల భాగం 1 పేరుతో ఈ నెల పదిహేడున రిలీజ్ చేయబోతున్నారు. ఆన్ లైన్ లో రివ్యూలు గట్రా చూసిన వాళ్ళకు దీని మీద మంచి ఆసక్తి నెలకొంది.
డిపార్ట్ మెంట్ లో చాలా నిజాయితీగా ఉండే ఓ పోలీస్ కానిస్టేబుల్(కమెడియన్ సూరి) చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి రగిలిపోతూ ఉంటాడు. వెనుకబడిన వర్గాల హక్కులకై పోరాడుతున్న ప్రజాదళం నక్సలైట్ బృందం నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) కోసం ప్రభుత్వం జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్(గౌతమ్ మీనన్) వచ్చాక సానుభూతిపరుల మీద ఆ ఇంటి ఆడాళ్ళ మీద ఖాకీ చొక్కా మాటున దారుణాలకు తెగబడతారు. దీంతో పెరుమాళ్ బయటికి వచ్చి అరాచకం మొదలుపెడతాడు. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లిందన్నదే స్టోరీ.
విజువల్స్ అన్నీ చాలా డెప్త్ తో ఇంటెన్సిటీతో రూపొందించారు వెట్రిమారన్. ఇళయరాజా సంగీతం, నాణ్యమైన తారాగణం ఏదో చీకటి ప్రపంచంలో ప్రయాణించే అనుభూతిని కలిగించేలా ఉంది. అయితే ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీస్ ని తెలుగు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోవడం లేదు. విరాట పర్వంలో ఇలాంటి ఇష్యూని టచ్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ కారణంగానే సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి అనువాద రూపంలో వచ్చి అందులోనూ ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేని విడుదల పార్ట్ 1 ఏ మేరకు మన ప్రేక్షకులను మెప్పిస్తుందో ఏప్రిల్ 15 తేలిపోతుంది.
This post was last modified on April 8, 2023 1:56 pm
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…