సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లినట్లుగా తాజాగా అప్‌డేట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఐతే ఆ పోస్టర్లో వెనుక నుంచి పవన్ లుక్ చూపించగా.. అక్కడున్నది పవర్ స్టార్ కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం కొంచెం గట్టిగానే జరిగింది.
ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్.. ప్రి లుక్ కోసం ఫొటో షూట్లో పాల్గొన్నాడంటే జనాలకు నమ్మకం కలగలేదు. గతంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రీకరణ సందర్భంగా ఓ సన్నివేశం కోసం పవన్ లాగా డ్రెస్ వేసుకుని హరీష్ శంకరే చిన్న షాట్‌లో కనిపించిన అనుభవం జనాలకు బాగానే గుర్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త లుక్‌లో ఉన్నది పవన్ కాదు, హరీషే అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఐతే ఈ ప్రచారానికి తెరదించాలని ప్లాన్ చేసి చేశారో ఏమో తెలియదు కానీ.. ఒక యువ దర్శకుడు ప్రి లుక్‌లో ఉన్నది పవన్ కళ్యాణే, అందుకు తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొనడం విశేషం. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘కలర్ ఫొటో’తో పాపులర్ అయిన సందీప్ రాజ్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ డిజైనింగ్ షూట్ కోసం తాను ఈ సినిమా సెట్స్‌కు వెళ్లానని.. పవన్‌ను నేరుగా చూడటం ఇదే తొలిసారని.. ఇదొక అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని, ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్‌కు కృతజ్ఞుడినని అతను ట్వీట్ వేశాడు.
ప్రి లుక్ పోస్టర్ మీద తలెత్తిన వివాదం గురించి అతనేమీ మాట్లాడకపోయినా.. ఈ ట్వీట్ చూస్తే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ లాగే ఉంది. నేరుగా ఈ వివాదం మీద స్పందించని హరీష్.. సందీప్‌తో ఇలా క్లారిటీ ఇప్పించి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్ అండ్ కో ఫేక్ పోస్టర్‌తో జనాల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసి ఉండదనే ఆశిద్దాం.
This post was last modified on April 7, 2023 10:14 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…