కొన్నిసార్లు నిజంగానే మాస్ పల్స్ పట్టుకోవడం పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది. రవితేజ ధమాకా రిలీజైనప్పుడు పబ్లిక్ టాక్ కొంచెం అటుఇటుగానే ఊగింది. మీడియా రివ్యూలు ఏమంత ఆశాజనకంగా రాలేదు. రొటీన్ కంటెంట్ నే ఇచ్చారని ఎలాంటి కొత్తదనం లేదనే పెదవివిరుపులే ఎక్కువ వినిపించాయి. కట్ చేస్తే అనూహ్య రీతిలో వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఔరా అనిపించింది. భీమ్స్ హుషారైన పాటలు, శ్రీలీల గ్లామర్ ప్లస్ డాన్సులు, టైంపాస్ చేయించిన కామెడీ వెరసి ధమాకా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడానికి దారి సుగమమయ్యింది.
ఇప్పుడు బుల్లితెర మీదా ధమాకా దుమ్మురేపింది. గత నెల చివరి వారం జరిగిన శాటిలైట్ ఛానల్ వరల్డ్ ప్రీమియర్ కి ఏకంగా 10.08 టిఆర్పి రేటింగ్ సాధించి అదరగొట్టింది. ఇది అర్బన్ క్యాటగిరీ. రూరల్ కలుపుకుని యావరేజ్ చేసినా 9.04 రావడం విశేషం. గత కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్లకు సైతం ఈ స్థాయి రెస్పాన్స్ రావడం లేదు. పైగా ధమాకా నెట్ ఫ్లిక్స్ లో వచ్చి వారాలు దాటేసింది. దాంట్లో చూసిన వాళ్ళు, లోకల్ కేబుల్ ఛానల్స్ లో ఎంజాయ్ చేసినవాళ్లు కోట్లలో ఉంటారు. అయినా కూడా టీవీలో ఇంత స్పందన రావడం చిన్న విషయం కాదు.
ఏది ఏమైనా మాస్ ఎంటర్ టైనర్లకుండే ఆదరణే వేరని మరోసారి ఋజువయ్యింది. అందులోనూ పాటలు కామెడీ అన్నీ బ్యాలన్స్ అయినప్పుడు ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. దీని తర్వాత వాల్తేరు వీరయ్యతో మరో హిట్ అందుకుని తాజాగా రావణాసురతో పలకరించిన రవితేజ తిరిగి అక్టోబర్ లో టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్నాడు. ఈగల్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉంటుంది. ఇవి కాకుండా మరో రెండు చర్చల దశలో ఉన్నాయి.వీటికి సంబంధించిన ప్రకటనలు ఇంకో రెండు మూడు రోజుల్లో రాబోతున్నాయి.
This post was last modified on April 7, 2023 10:21 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…