కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడో సెట్ అయిపోతాయి. కానీ బయటికొచ్చే సరికి చాలా టైమ్ పడుతుంది. ఇలాంటి ఓ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అయింది కానీ ఇంత వరకూ ఎలాంటి లీకులు లేవు. ఆ క్రేజీ కాంబోనే రాజమౌళి -ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజ్ తో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబో ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఎవరి కమిట్ మెంట్స్ వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కలుద్దామని అనేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు.
ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ దిల్ రాజు కి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే దిల్ రాజు రాజమౌళి తో చేస్తున్నాడు ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పకుండా దిల్ రాజు ఆ తర్వాత ఉండే కాంబో సినిమాను రివీల్ చేశారు. అంటే రాజమౌళి -ప్రభాస్ ఓ బేనర్ కి కమిట్ అయి ఉండవచ్చు. దాని తర్వాతే దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు.
ఏదేమైనా దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది ప్రభాస్ నే అనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి ఇంకా రెండేళ్ళు పైనే పడుతుంది. ఆ తర్వాత కథ కమామియా కోసం ఇంకొన్ని నెలలు తీసుకుంటారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ తన లైనప్ కంప్లీట్ చేసేసుకుంటాడు కావచ్చు. ఈసారి ఈ కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండొచ్చు.
This post was last modified on April 6, 2023 7:17 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…