నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాను ఒక న్యూస్ హోరెత్తించేస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్-2’ సినిమాలో నటించబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం. ఆల్రెడీ హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమా ‘వార్’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోయే సినిమాలో హృతిక్, తారక్ కలిసి నటిస్తారన్న సమాచారం భారతీయ సినీ ప్రేమికులను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది.
హృతిక్‌కు దక్షిణాదిన కూడా భారీగానే అభిమానులు ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ ఉత్తరాదిన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ కలయికలో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో మోత మోగిపోవడం ఖాయం.ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సులు భూమి బద్దలయ్యే రేంజిలో ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. హృతిక్, తారక్ పేస్ ఆఫ్ సీన్ల గురించి ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది.
ఐతే కేవలం యాక్షన్‌తో సరిపెడితే అభిమానులు ఊరుకోరు. అంతకుమించి ఆశిస్తారు. ముఖ్యంగా హృతిక్, తారక్ డ్యాన్స్‌లో పోటీ పడితే చూడాలని ప్రేక్షకులు ఆశిస్తారనడంలో సందేహం లేదు. బాలీవుడ్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ డ్యాన్సర్లలో హృతిక్ ఒకడు. ప్రస్తుతం హిందీలో అతణ్ని మించిన డ్యాన్సర్ లేడు. టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు కూడా బాగా డ్యాన్సులు వేసేవాళ్లే కానీ.. హృతిక్‌లో ఉన్న గ్రేస్, స్టైల్ వీరిలో కనిపించవు.
ఇక తారక్ ఎలాంటి డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నవతరం స్టార్లలో అతను నంబర్ వన్ డ్యాన్సర్ హోదాకు గట్టి పోటీదారే. ఇలాంటి ఇద్దరు హీరోలు కలిసి చేయబోతున్న సినిమాలో మంచి డ్యాన్స్ నంబర్ ఉండి.. తారక్, హృతిక్ తమ నృత్యకళను చూపించే ప్రయత్నం చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ విషయంలో ఆల్రెడీ సోషల్ మీడియా జనాల్లో దీనిపై ఊహాగానాలు మొదలైపోయాయి. హృతిక్, తారక్ బెస్ట్ డ్యాన్స్ వీడియోలతో ఒకరికొకరు ఎలివేషన్లు ఇస్తూ.. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చను వేడెక్కిస్తున్నారు.
This post was last modified on April 6, 2023 6:56 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…