గత ఏడాది కార్తికేయ 2 రూపంలో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న కుర్ర హీరో నిఖిల్ ఆ తర్వాత డిసెంబర్ లో వచ్చిన 18 పేజెస్ తో మళ్ళీ ఆ స్థాయి ఫలితం అందుకోలేదు కానీ జస్ట్ యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదెప్పుడో ఒప్పుకున్న మూవీ కాబట్టి రిజల్ట్ ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత రావాల్సిన చిత్రం స్పై. కెరీర్ లో మొదటిసారి గూఢచారి గా నిఖిల్ నటించిన ఈ సినిమా విడుదల కాదు కదా కనీసం షూటింగ్ ఏ స్టేజిలో ఉందో కూడా బయటికి చెప్పడం లేదు. ఆపేశారా లేక చిన్న బ్రేక్ ఇచ్చారా ఎలాంటి క్లూ లేక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
దీని టీజర్ వచ్చి పది నెలలు దాటేసింది. ఆ తర్వాత ఉలుకు పలుకు లేదు. ఈ వేసవిని టార్గెట్ చేసుకుని ఉంటే మంచి డేట్ దక్కేది. కానీ ఆ సూచనలు కనిపిస్తేగా. ప్రముఖ ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మల్టీ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేశారు. కొంత కీలక భాగం విదేశాల్లోనూ షూట్ చేశారు. అడవి శేష్ గూఢచారి రేంజ్ లో అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడే మౌనం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న స్పై కోసం పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేశారు.
ఏదైనా బడ్జెట్ సమస్యా లేక ఇంకేదైనా కారణమా తెలిస్తే బాగుండేది. కార్తికేయ 2 సక్సెస్ తో నిఖిల్ సబ్జెక్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఒప్పుకున్న వాటి ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి. అఖిల్ ఏజెంట్ కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఖచ్చితంగా వస్తుందనే రీతిలో ప్రమోషన్లు చేస్తున్నారు కానీ ఇంకో పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ఒకవేళ దీని ఫలితం చూశాక స్పై స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేయాలనుకున్నారో లేక కొంచెం గ్యాప్ వచ్చేలా చూసుకుందామని అనుకున్నారో స్పై సృష్టికర్తలకే ఎరుక.
This post was last modified on April 5, 2023 7:53 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…