చిన్న గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా సాయి ధరం తేజ్ తో చేస్తున్న ‘వినోదాయ సీతమ్’ రీమేక్ ను కంప్లీట్ చేశాడు పవన్. ఇక హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , సుజీత్ తో ఓజీ అనే సినిమా చేయబోతున్నాడు. వీటి మధ్యలో క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు ఉండనే ఉంది. ఇక సురేందర్ రెడ్డి వంటి దర్శకులు కూడా పవన్ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారు.
తాజాగా పవన్ లైనప్ లో మరో దర్శకుడు చేరాడు. అతడే సుధీర్ వర్మ. స్వామీ రారాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సుధీర్ కి కాస్త గుర్తింపు ఉంది. స్టైలిష్ మేకింగ్ తో ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే పవన్ కోసం త్రివిక్రమ్ ఓ స్టైలిష్ యాక్షన్ కథ సిద్దం చేసి , దాన్ని సుధీర్ వర్మతో డైరెక్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ విషయాన్ని తన అప్ కమింగ్ మూవీ ‘రావణాసుర’ ప్రమోషన్స్ లో చెప్పుకున్నాడు సుధీర్ వర్మ. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది ? అనేది మాత్రం తనకి తెలియదని అంతా త్రివిక్రమ్ గారి చేతిలోనే ఉందని అన్నాడు. రావణాసుర థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పవన్ డేట్స్ లేవు, కానీ త్రివిక్రమ్ తలుచుకుంటే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం.
This post was last modified on April 5, 2023 6:33 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…