పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న దర్శకుడు Harish Shankar నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. పవర్ స్టార్ కోసమే మూడేళ్లు ఎదురు చూసిన ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్ కు చివరికి తేరి రీమేక్ చేయాల్సి వచ్చినా కీలకమైన మార్పులతో చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది.
అతి త్వరలో నాన్ స్టాప్ గా రెండు నెలల పాటు దీని చిత్రీకరణ జరగబోతున్నట్టు యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. హరీష్ ఎలాగైనా 2024 సంక్రాంతికి విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నాడు కానీ అది జనసేన కార్యకలాపాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇక హరీష్ శంకర్ తర్వాత చేయబోయేది మాస్ మహారాజా Raviteja తోనే. ఈ కన్ఫర్మేషన్ స్వయంగా ఆ ఇద్దరి నుంచే రావడం విశేషం. రావణాసుర ప్రమోషన్ల భాగంగా రవితేజ ఈ రోజు ఫ్యాన్స్ తో ట్విట్టర్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఒక అభిమాని మిరపకాయ్ కాంబో కోసం ఎదురు చూస్తున్నామని ఎప్పుడు ఉండొచ్చని అడిగాడు. దీనికి స్పందించిన రవి నేరుగా హరీష్ ని ట్యాగ్ చేసి ఇదేదో అడుగుతున్నారు చూడమని పబ్లిక్ గా ఓపెన్ అయ్యాడు. దీంతో త్వరలోనే ఒక పీరియాడిక్ డ్రామాను ప్లాన్ చేశామని దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పేశాడు.
ఈ లెక్కన టైగర్ నాగేశ్వరరావు తర్వాత రవితేజ మరో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నాడు. దీనికన్నా ముందు కార్తీక ఘట్టమనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈగల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఇంకో ప్రాజెక్టు చర్చల దశలో ఉంది.
అటుపక్క జనవరికంతా ఉస్తాద్ భగత్ సింగ్ కి గుమ్మడికాయ కొట్టేశాక హరీష్ శంకర్ ఫ్రీ అయ్యి ఇటు పక్క వచ్చేయొచ్చు. షాక్ రూపంలో తనకు ఫ్లాప్ ఇచ్చినప్పటికీ ఇతని మీద నమ్మకంతోనే రవితేజ మిరపకాయ్ ఛాన్స్ ఇస్తే అదిరిపోయే హిట్టు కొట్టారు ఇద్దరు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రంగం సిద్ధం
Gulte Telugu Telugu Political and Movie News Updates