జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని చూసి చెప్పొచ్చు. ఏడాదికి పైగా నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడం, సెట్లో తారక్ అడుగు పెట్టిన వీడియోకు భారీ స్పందన రావడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు దీని ద్వారానే పరిచయం కానుండగా కొంత గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ తెలుగు సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఇందులో మెయిన్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. యూనిట్ అధికారికంగా ధృవీకరించకపోయినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే రీతిలో కథనాలు వచ్చాయి. లేటెస్ట్ ముంబై అప్డేట్ ప్రకారం సైఫ్ పలు దఫాల చర్చల తర్వాత నో అన్నాడట. కారణాలు ఖచ్చితంగా తెలియకపోయినా చాలా బల్క్ డేట్లు అడగడంతో తాను ఒప్పుకున్న ఇతర హిందీ సినిమాలకు ఇబ్బందవుతుందేమోననే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. ఇది ప్రకాష్ రాజ్ లేదా శ్రీకాంత్ ఇద్దరిలో ఒకరికి ఇచ్చిన క్యారెక్టరేనని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
ఆది పురుష్ లో పది తలల రావణాసురుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కు దాని గెటప్ విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇది తనకు సంబంధం లేని వ్యవహారమే అయినా దక్షిణాది ప్రేక్షకులకు నేరుగా పరిచయం కావడం కోసం ఎదురు చూస్తున్న సైఫ్ ని ఈ స్పందన సంతోషపెట్టలేదు. దీని సంగతలా ఉంచితే పలు జాతీయ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు చేస్తున్న ఎన్టీఆర్ 30 విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. ఆచార్య గాయం మానాలనే కసితో కొరటాల శివ ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఏకంగా అయిదేళ్ల గ్యాప్ తో సోలో హీరోగా తారక్ చేస్తున్న మూవీ ఇది.
This post was last modified on April 4, 2023 12:42 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…