ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎలా అయినా సినిమాను ప్రమోషన్ చేసుకోవచ్చు. తమ సినిమాలకు కాస్త బజ్ తెచ్చుకునేందుకు కుర్ర హీరోలు చాలా రకాల ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఎప్పట్లానే తన అప్ కమింగ్ సినిమా మీటర్ ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో పాట్లు పడుతున్నాడు. ఇటీవలే ఆటో ఎక్కి తను షార్ట్ ఫిలిమ్ లో ఓ ఆటో పాత్ర చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు.
తాజాగా కమెడియన్ సప్తగిరి తో కలిసి చదువునే పిల్లలను సమ్మర్ హాలిడేస్ లో తమ మీటర్ సినిమా చూడాలని చెప్తున్నట్టు ఓ వీడియో చేశాడు. అందులో ఎగ్జామ్ అయిపోయాయి పుస్తకాలు చింపేసామ్ అని చెప్పిన వెంటనే ఆ పేపర్ లు తెచ్చుకోండి మాస్ సినిమా కదా అంటూ చెప్పుకున్నాడు కిరణ్. అంటే తన సినిమాకు పేపర్ లు ఎగరేయమని చెప్తున్నాడన్నమాట. అయితే అంతా విన్నాక ఆ పిల్లలు మీటర్ కి టికెట్స్ బుక్ చేసుకున్నామని చెప్పడంతో వీడియో ఎండ్ అవుతుంది.
ఇప్పటికే టూర్లు , ప్రెస్ మీట్లు , ఈవెంట్స్ , ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఇప్పుడు ఇలా డిఫరెంట్ వీడియోస్ వదిలి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు యంగ్ హీరో. ఫిబ్రవరిలో వినరో భాగ్యము విష్ణు కథ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ రెండు నెలల్లోనే మీటర్ తో వస్తున్నాడు. ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తుండటంతో ఈ కుర్ర హీరోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
This post was last modified on April 3, 2023 9:50 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…