తన జీవితంలో ఊహించని ఓ సంఘటన తర్వాత సాయి ధరం తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా సినిమాలో కేరెక్టర్స్ ను పరిచయం చేస్తూ ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సినిమా కథంతా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. అందులో ఉండే పాత్రలను చూపించారు. అయితే ఈవెంట్ ఏర్పాటు చేసి ఇలా పాత్రలను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేయడం బాగుంది. మేకర్స్ కాస్త యూనిక్ గా ఆలోచించారు. అయితే ఈ పాత్రల్లో ఒక్కటి కూడా ప్రేక్షకులను కొత్త అనుభూతి కలిగించలేదు.
నిజానికి ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో ఉండే టిపికల్ కేరెక్టర్స్ ఏవి ఇందులో లేవు. రెగ్యులర్ గా హారర్ సినిమాల్లో , విలేజ్ డ్రామాలో కనిపించే పాత్రలు, గెటప్ లే ఇందులోనూ కనిపించాయి. అయితే కేరెక్టర్స్ పరిచయ వేదిక పై ఏ ఒక్క యాక్టర్ సర్ ప్రయిజ్ చేయలేదు. సునీల్ , అజయ్ , బ్రహ్మాజీ , సాయి చంద్ ఇలా ఎవరూ గెటప్ తో కొత్తగా కనిపించలేదు. ముఖ్యంగా తేజ్ , సంయుక్తాలు లుక్స్ కూడా కొత్తగా లేవు. సంయుక్తా కి ఈ పాత్ర కొత్తగా అనిపించవచ్చు కానీ గతంలో అనుష్క, సమంతా నుండి చాలా మంది ఈ తరహా విలేజ్ పాత్రలు చేసేశారు. పాత్రల సంగతి పక్కన పెడితే కంటెంట్ ఏ మాత్రం రొటీన్ అయినా ప్రేక్షకులు తిప్పి కొట్టే ఛాన్స్ ఉంది.
అయితే కార్తీక్ దండు రెగ్యులర్ పాత్రలతోనే సరికొత్త కథ చెప్పబోతున్నాడని అంటున్నారు. కార్తీక్ కథకి సుకుమార్ అదిరిపోయే స్క్రీన్ ప్లే ఇచ్చారని ఇన్ సైడ్ టాక్. మరి సమ్మర్ లో వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి. తేజ్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టడం చాలా ముఖ్యం.
This post was last modified on April 4, 2023 9:51 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…