ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రావణాసుర మీద మాములుగా మాస్ మహారాజా సినిమాకుండాల్సిన హై బజ్ కనిపించడం లేదు. సెన్సారేమో ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఇంటర్వ్యూలలో టీమ్ ఫలితం పట్ల చాలా నమ్మకాన్ని చూపిస్తోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న సినిమా అంటే ఓ రేంజ్ లో హైప్ ఉండాలి. సోషల్ మీడియాలోనూ దాని మీద విపరీతమైన చర్చ జరగాలి. కానీ అలాంటి హడావిడేమీ కనిపించడం లేదు. ఇంత లో ప్రొఫైల్ రవితేజ చాలా తక్కువసార్లు చూపించాడు.
దీనికి కారణాలు కనిపిస్తున్నాయి. రావణాసుర ప్రాథమికంగా హింసాత్మక కంటెంట్ ఎక్కువగా ఉన్న క్రైమ్ థ్రిల్లర్. శైలేష్ కొలను హిట్ సిరీస్ తరహాలో పబ్లిక్ టాక్ వచ్చాకే దీని గురించిన డిస్కషన్స్ ఉంటాయి. పైగా షాక్ ఇచ్చే ఎలిమెంట్స్ చాలా ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయలేమని, ఏ పాయింట్ గురించి చెప్పినా కథను లీక్ చేసినట్టు ఉంటుందని ఎవరికి వారు చాలా గుంభనంగా మాట్లాడుతున్నారు. కామెడీ, పాటలు వగైరా రెగ్యులర్ అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికన్నా ఎక్కువగా థ్రిల్స్ ఉంటాయని పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు.
దీని సక్సెస్ దర్శకుడు సుధీర్ వర్మకు చాలా కీలకం. గట్టి బ్లాక్ బస్టర్ కొట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. గత చిత్రం శాకినీ డాకిని డిజాస్టర్ అయ్యింది. అది పూర్తి చేయడంలో ఏదో వివాదం తలెత్తి ప్రమోషన్ల దూరంగా ఉన్న సుధీర్ తన మీద వచ్చిన కామెంట్లకు రావణాసురతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆరుగురు హీరోయిన్లు ఉన్నా కనీసం ఆ పాయింట్ ని హైలైట్ చేయడం లేదు. మొత్తానికి అండర్ కరెంట్ లాగా రావణాసుర సందడి నెమ్మదిగానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మొదలుపెట్టేశారు కానీ అవీ స్లో పాయిజన్ లా సాగుతున్నాయి.
This post was last modified on April 3, 2023 5:48 pm
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…