టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో హీరోల పరంగా ప్రభాస్ పేరు ముందుంటే సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ ప్లేస్ నుంచి కిందికి దిగిరావడం లేదు. ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు డిఎస్పి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. దగ్గరి బంధువుల్లోనే వరసకు మరదలయ్యే అమ్మాయి సంబంధం ఖాయం చేశారట. ఆ మేరకు రెండు కుటుంబాల మధ్య చర్చలు అంగీకారాలు అన్నీ అయ్యాయని తెలిసింది. వికీపీడియాలో ఉన్న డేటా ప్రకారం దేవి వయసు ఇప్పుడు నలభై మూడేళ్లు. చేసుకోబోయే యువతి తన కన్నా పదిహేడు సంవత్సరాల చిన్నదని వినికిడి.
నిజానికి దేవి పెళ్లి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతునా ఎందుకో మరి ఏవీ కొలిక్కి రాక చాలా సమయం పట్టింది. 1997లో ఎంఎస్ రాజు నిర్మించిన దేవితో ఇండస్ట్రీకి వచ్చిన డిఎస్పి డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకుని అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. చిరంజీవి బాలకృష్ణ లాంటి నిన్నటి తరం స్టార్లతో మొదలుపెట్టి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పటి హీరోల దాకా ఎందరికో అద్భుతమైన ఛార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అయితే గత కొంత కాలంగా తన స్థాయి ఫామ్ లో లేకపోవడం అభిమానులను కలవరపెడుతూ వచ్చింది.
మరోవైపు తమన్ దూసుకుపోవడం దేవి స్పీడ్ కి బ్రేకులు వేసింది. గత కొంతకాలంగా రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్యలు మాత్రమే తన స్థాయికి తగ్గ పాటలతో మ్యూజిక్ లవర్స్ మెప్పు పొందాయి. ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 ది రూల్ మీద ఫ్యాన్స్ ఆశలన్నీ. మొత్తానికి కాస్త లేట్ అయినా దేవి పెళ్లి వార్త గట్టిగానే వైరల్ అవుతోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు సామెత తరహాలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. మరి నిజంగానే బ్రహ్మచర్యానికి దేవిశ్రీ ప్రసాద్ స్వస్తి చెప్పబోతున్నాడో లేదో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. జరిగితే మాత్రం గ్రాండ్ సెలబ్రిటీ ఈవెంట్ అవుతుంది.
This post was last modified on April 3, 2023 3:24 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…