Movie News

ర‌ష్మిక కూడా ఆ లీగ్‌లోకి వ‌చ్చేసింది

క‌థానాయికలుగా ఒక ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ఒక్కరికీ ఉంటుంది. ఇంతకుముందులాగా కెరీర్ ముగింపు ద‌శ‌లోనే ఆ త‌ర‌హా చిత్రాలు చేయ‌డం లేదు ఇప్ప‌టి హీరోయిన్లు. ఓవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న పెద్ద సినిమాల్లో గ్లామ‌ర్ రోల్స్ చేస్తూనే మ‌రోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తున్నారు.

కొంచెం ముందుత‌రంలో అనుష్క, స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా.. ఇలా చాలామంది టాలీవుడ్ హీరోయిన్లు క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ర‌ష్మిక మంద‌న్నా కూడా చేరుతోంది. ఇప్ప‌టిదాకా ప‌లు భాష‌ల్లో హీరోల ప‌క్క‌న జోడీగానే న‌టిస్తూ వ‌చ్చిన ర‌ష్మిక.. తొలిసారి త‌నే లీడ్ రోల్‌లో సినిమా చేయ‌బోతోంది. ఆ సినిమా సోమ‌వార‌మే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.

త‌మిళంలో ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ అయిన డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్.. ర‌ష్మిక తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ‘రెయిన్‌బో’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగు భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రాన్ని శాంతరూబన్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించనున్నాడు. అతను ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ఒక యునీక్ స‌బ్జెక్టుతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ట‌. ఖాకి, ఖైదీ స‌హా త‌మిళంలో ప‌లు చ‌త్రాల‌ను నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్స్ అధినేత‌లు ఎస్.ఆర్.ప్ర‌భు, సురేష్ బాబుల‌కిది 30వ సినిమా. కొంచెం పెద్ద బ‌డ్జెట్లోనే సినిమాను నిర్మించ‌బోతున్నార‌ట‌.

జాతీయ స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ర‌ష్మిక‌.. తొలిసారి న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డంతో ఇది ప్ర‌త్యేకంగానే ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులో పుష్ప‌-2తో పాటు నితిన్-వెంకీ కుడుముల సినిమాలోనూ న‌టిస్తోంది. హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న సందీప్ రెడ్డి రూపొందిస్తున్న యానిమ‌ల్‌లోనూ క‌థానాయిక‌గా చేస్తోంది.

This post was last modified on April 3, 2023 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago