ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ పెద్దగా లేని చిన్న హీరోలకు సినిమా పూర్తి చేయడం సులభంగా ఉంది కానీ దాన్ని రిలీజ్ చేయడం పెద్ద సవాల్ గా మారుతోంది. సరైన డేట్ దొరక్క ఒకవేళ ఏదైనా ఫిక్స్ చేసుకుంటే హఠాత్తుగా ఏదైనా పెద్ద మూవీ రావడం ఇలా మాములు కష్టాలు లేవు. ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించిన బెదురులంక ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. టీజర్ గట్రా వచ్చేశాయి కానీ థియేటర్లకు ఎప్పుడు వదలాలో అంతు చిక్కడం లేదు.
ముందు మార్చి 21 అనుకున్నారు కానీ దాస్ కా ధమ్కీ ఉండటం వల్ల డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ లో ఫ్రీ స్లాట్లు లేవు. అసలే ఇది కార్తికేయకు కీలకమైన సినిమా. వరస డిజాస్టర్ల తర్వాత మార్కెట్ బాగా దెబ్బ తింది. అందుకే ఆశలన్నీ దీని మీద పెట్టుకున్నాడు. బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ ది సైతం ఇదే సమస్య.
ఇదీ మార్చి 10నే రావాల్సింది. పరీక్షలు ఉన్నాయని ఆపేశారు. తీరా చూస్తే మే కన్నా ముందు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఏప్రిల్ 21 అనుకుంటున్నారు కానీ దానికి ముందు వెనుకా ఉన్నా పోటీ వల్ల రిస్క్ గానే కనిపిస్తోంది. శ్రీవిష్ణు సామజవరగమన ఏదోలా మే 18కి లాక్ చేసుకుంటే అదే రోజు సంతోష్ శోభన్ అన్నీ మంచి శకునములే కూడా వస్తోంది.
ఇవన్నీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నవి.పెద్ద సినిమాలకు దారి ఇవ్వడం కోసం రాజీ పడినవి. ఏదోలా రిలీజ్ చేయడం సంగతి ఎలా ఉన్నా జనాన్ని థియేటర్లకు రప్పించడం, పాజిటివ్ టాక్ వచ్చేదాకా కిందామీదా పడి ప్రమోషన్లు చేసుకోవడం ఇదో పెద్ద తతంగం. బాగున్న వాటిని ప్రేక్షకులు ఆదరించడంలో అనుమానం లేదు కానీ పెద్ద బ్యానర్ల అండ లేని వాటిని ఓ రెండు వారాలు థియేటర్లలో ఉండేలా చేసుకోవడం కత్తిసాములా మారిపోయింది. అసలే మండే ఎండలు. వీటికి తోడు ఇలాంటి సమస్యలు. కుర్ర హీరోల చిక్కులు అన్నీ ఇన్నీ కావు.
This post was last modified on April 2, 2023 7:41 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…