న్యాచురల్ స్టార్ నాని దసరా బాక్సాఫీస్ కు జ్వరంలా పట్టేసుకుంది. నైజామ్ ఏపీ సెంటర్ల వారిగా తేడా లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపించేస్తోంది. మూడు రోజులకే 70 కోట్ల గ్రాస్ దాటడం సంక్రాంతి సినిమాల తర్వాత ఇదే. అందులోనూ నాని ఈ ఫీట్ సాధించడం పట్ల ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. మొదటి వారం పూర్తయ్యేలోగానే వంద కోట్ల మార్కును చేరుకోవడం సులభంగానే కనిపిస్తోంది. పైగా వచ్చే వారం శుక్రవారం గుడ్ ఫ్రైడేతో మొదలుపెట్టి వరసగా సెలవులు మళ్ళీ కలిసిరావడంతో దసరా ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఖాయమేనని ట్రేడ్ టాక్.
ఇప్పుడీ దసరా ఫీవర్ జొమాటో దాకా పాకింది. సాధారణంగా తన కస్టమర్లను ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఆకట్టుకోవడం ఈ యాప్ అలవాటు. ఇప్పుడు బిర్యానీ తినమని చెప్పడానికి సూచికగా నాని డైలాగుని వాడేసుకుంది. వ్యసనం కాదు అలవాటు పడిన సంప్రదాయమంటూ సినిమాలో ఉన్న మందు డైలాగ్ ని ఇలా హైదరాబాద్ ప్రసిద్ధ వంటకం లాగించండని చెప్పడం వెరైటీగా ఉంది. దీన్ని బట్టే సంభాషణల రీచ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సెన్సార్ అభ్యంతరం చేసిన కొన్ని పదాలు సైతం బాగా వైరల్ అవుతున్నాయి.
అటు హిందీ ఇతర భాషల్లో దసరా పికప్ బాగుంది. ఈ వారం రావణాసుర, మీటర్ లు ఉన్నప్పటికీ అవి నాని మూవీ లాగా ఊర మాస్ పల్లెటూరి మసాలాలు కాదు కాబట్టి బిసి సెంటర్లలో అంత సులభంగా నెమ్మదించే అవకాశం కనిపించడం లేదు. శని ఆదివారాలు నగరాల్లో అడ్వాన్స్ రూపంలో 80 శాతం పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే ఇది ఏ స్థాయి సక్సెసో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలం, పుష్పల సరసన నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో నాని ఇదే మాట చెబుతూ వచ్చాడు. చూస్తుంటే నిజమయ్యే రోజు వచ్చేలాగే ఉంది
This post was last modified on April 2, 2023 1:00 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…