తెలుగు స్టార్ హీరోలకు ముందు నుంచి తమిళ దర్వకులంటే మోజే. కానీ అక్కడి దర్శకులు మన హీరోలకు ఎక్కువగా ఫెయిల్యూర్లే అందించారు. తమిళంలో బ్లాక్‌బస్టర్ల మీద బ్లాక్‌బస్టర్లు కొట్టిన మురుగదాస్ సైతం తెలుగులో రెండు ఫెయిల్యూర్ సినిమాలే ఇచ్చాడు. చిరంజీవితో చేసిన స్టాలిన్ అయినా కాస్త పర్వాలేదు కానీ.. మహేష్ బాబుతో ఆయన తీసిన స్పైడర్ మాత్రం పెద్ద డిజాస్టరే అయింది.
మురుగదాస్ టాప్ ఫాంలో ఉండగా చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక ఘోరంగా దెబ్బ తింది. మురుగదాస్ పతనం కూడా ఈ సినిమాతోనే మొదలై, ఆ తర్వాత ఒక్క సక్సెస్ ఫుల్ సినిమా కూడా అందించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన సినిమానే చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఐతే తన నిర్మాణంలో తెరకెక్కిన 1947 అనే సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన మురుగదాస్.. స్పైడర్ ఫెయిల్యూర్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.
రీమేక్ సినిమాలను పక్కన పెడితే.. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడతామని.. స్పైడర్ విషయంలోనూ అలాగే కష్టపడ్డామని మురుగదాస్ తెలిపాడు. ప్రేక్షకుల అంచనాలు, దర్శకుల క్రియేటివిటీ కలిసినపుడు హిట్ సినిమా వస్తుందని.. అలా కానపుడు ఫెయిల్యూర్ ఎదురవుతుందని మురుగదాస్ అన్నాడు.
స్పైడర్ ఫెయిల్యూర్ తనను నిరాశకు గురి చేసిందని, మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయానే అని బాధ పడ్డానని.. కానీ మహేష్‌తో మళ్లీ కచ్చితంగా సినిమా చేస్తానని, హిట్ కొడతానని మురుగదాస్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్‌తో సినిమా చేసే విషయమై మాట్లాడుతూ.. ప్రతి దర్శకుడూ పది మంది హీరోలను కలుస్తాడని, అలాగే హీరో కూడా పదిమంది దర్శకులను మీట్ అవుతాడని.. కానీ ఎవరితో సినిమా కుదురుతుందో చెప్పలేమని.. అల్లు అర్జున్‌తో తన సినిమా చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని మురుగదాస్ తెలిపాడు.
This post was last modified on April 2, 2023 8:47 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…