Movie News

ఆ హీరో.. రోజుకు 60 సిగరెట్లు

సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి రూపొందించిన సూపర్ హిట్ సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ గుర్తుందా? అందులో హరికృష్ణ సహా చాలా మంది టాలీవుడ్ సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించగా.. అంకితకు జోడీగా ఉత్తరాది కుర్రాడు ఆదిత్య ఓం నటించాడు. జేడీ చక్రవర్తి తరహాలో ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ కొంత కాలం టాలీవుడ్లో బాగానే సందడి చేశాడు ఆదిత్య.

‘లాహిరి లాహిరి లాహిరిలో’ తర్వాత ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ సహా కొన్ని చిత్రాల్లో నటించిన అతను.. ఆపై దర్శకుడిగా కూడా మారి ఓ సినిమాను రూపొందించాడు. కానీ ఉన్నట్లుండి అతను టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు అతను ‘దహనం’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మూర్తి స్థాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.

‘దహనం’ రిలీజ్ సందర్భ:గా మీడియాను కలిసిన ఆదిత్య.. టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాక తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఒక దశలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని, విపరీతంగా మద్యపానం చేసేవాడినని అతను చెప్పడం విశేషం. కానీ తర్వాత ఆ దురలవాట్లకు దూరమైనట్లు వెల్లడించాడు.

“నా కెరీర్లో అనుకోకుండా విరామం వచ్చింది. డిప్రెషన్ అందరి జీవితాల్లోనూ ఉండేదే. నేను కూడా దాన్ని ఎదుర్కొన్నా. రోజుకు 60 సిగరెట్లు తాగా. మద్యం కూడా తాగా. కానీ నా కుటుంబ సభ్యుల సహకారంతో ఆ దశను అధిగమించా. 2017లో ఒక రోజు నిద్ర లేచి ఇక సిగరెట్ తాగకూడదు, మందు ముట్టకూడదు అని బలంగా నిర్ణయించుకున్నా. దానికి కట్టుబడే ఉన్నా. మళ్లీ ఆరోగ్యవంతుడిని అయ్యా. కెరీర్లో చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా. నువ్వింకా బతికే ఉన్నావా అని చాలామంది కామెంట్ చేశారు” అని ఆదిత్య తెలిపాడు.

This post was last modified on April 2, 2023 8:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముకేశ్ అంబానీ రూ.వెయ్యి కోట్ల విమానం వచ్చేసింది

ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు…

3 hours ago

డీజే టిల్లు.. అసలు టైటిల్ అది కాదు

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన…

4 hours ago

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు భాయ్ జాన్

రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి.…

6 hours ago

సిట్ ముందుకు శ్రవణ్… ‘ట్యాపింగ్’ కొలిక్కి వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

మంచు విష్ణు ట్విస్ట్ – కన్నప్ప వాయిదా

ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ…

8 hours ago

‘వక్ఫ్’కు వైసీపీ వ్యతిరేకం… అంతలోనే ఎంత మార్పు?

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి ఏపీలోని విపక్షం వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు…

8 hours ago