Movie News

మురుగదాస్ పెద్ద రిస్కే చేస్తున్నారు

గజినీ, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు మురగదాస్ తన స్థాయి సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. లేకలేక సూపర్ స్టార్ రజినీకాంత్ ఛాన్స్ ఇస్తే దర్బార్ ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేక యావరేజ్ గా నిలిచింది. ఒకవేళ అది హిటయ్యుంటే ఇవాళ కథ ఇంకోలా ఉండేది. సరే కొత్త ప్రాజెక్ట్ సెట్ అయ్యేదాకా ఖాళీగా ఉండటం ఎందుకని దాస్ నిర్మాతగా మారారు.

ఆయన భారీ బడ్జెట్ తో తీసిన ప్యాన్ ఇండియా మూవీ ఆగస్ట్ పదిహేను 1947 తమిళనాడులో ఏప్రిల్ 7న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాకు ఖర్చు ఎక్కువే అయ్యింది. అయితే దసరా జోరు, అదే రోజు రావణాసుర, మీటర్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని ఒక వారం ఆలస్యంగా 14న తీసుకురాబోతున్నారు.

అప్పుడు కూడా శాకుంతలం, రుద్రుడు రేస్ లో ఉన్నప్పటికీ ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. మణిరత్నం కడలితో పరిచయమైన గౌతమ్ కార్తిక్ ఇందులో హీరో. స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో భారతదేశంలో జరిగిన కొన్ని దారుణ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రయిలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.

కానీ ఇలా వారం గ్యాప్ తీసుకోవడం వల్ల ఒరిజినల్ వెర్షన్ కు టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడి బిజినెస్ రిస్క్ లో పడుతుంది. ఠాగూర్ మధు, ఎన్వి ప్రసాద్ లాంటి అగ్ర డిస్ట్రిబ్యూటర్లు అండగా ఉన్నారు కాబట్టి సరిపడా థియేటర్లు దొరుకుతాయి కానీ ఆర్టిస్టులు పరిచయమే లేని ఆర్టిస్టుల సినిమాను మన జనానికి రీచ్ చేయడం చాలా కష్టం. మురుగదాస్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు మొదలుపెట్టారు. మీడియాకు ముందుగానే ప్రీమియర్లు వేయబోతున్నారు. మరి సమంతా, రవితేజ, కిరణ్ అబ్బవరం, లారెన్స్ ల కాంపిటీషన్ ని తట్టుకుని దాస్ తన సినిమాను ఎలా గెలిపిస్తారో చూడాలి.

This post was last modified on April 1, 2023 10:31 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago