Movie News

అందరూ తగ్గిస్తుంటే ఆమె మాత్రం..

లాక్ డౌన్ వల్ల దారుణంగా దెబ్బ తిన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. నిర్మాతల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ పూర్తి చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక వడ్డీల భారం పెరిగిపోతోంది. చిత్రీకరణ మధ్యలో ఉన్న సినిమాల బడ్జెట్టూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ వేళ స్టాఫ్‌ను మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. అనేక పరిమితుల మధ్య, అదనంగా ఖర్చు పెట్టుకుని షూటింగ్స్ చేయడమూ కష్టంగా ఉంది. దీంతో నిర్మాతలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసి వివిధ ఇండస్ట్రీల్లో నటీనటులు, టెక్నీషియన్లు పరిస్థితులు చక్కబడే వరకు పారితోషకాలు తగ్గించుకోవడంపై చర్చలు నడుస్తున్నాయి. కోలీవుడ్లో ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కొందరు ఆర్టిస్టులు స్వచ్ఛందంగా పారితోషకాలు తగ్గిస్తున్నారు కూడా.

టాలీవుడ్లోనూ ఇది అమలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే నిర్మాతలు పారితోషకాలు తగ్గించడం గురించి ఆలోచిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఓ కథానాయిక తన పారితోషకాన్ని మరింత పెంచినట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ నంబర్ వన్ అనదగ్గ పూజా హెగ్డే. అరవింద సమేత, వాల్మీకి, అల వైకుంఠపురములో.. ఇలా వరుస సక్సెస్‌లతో పూజ డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. కొన్నేళ్ల వరకు ఆమె డైరీ ఖాళీగా లేదు. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ చూసి… ఆమె తన పారితోషకాన్ని అర కోటి పెంచేసిందట. ఇంతకుముందు రూ.1.5 కోట్లు పుచ్చుకుంటున్న ఆమె.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. పూజకు ఉన్న క్రేజ్, డిమాండ్, ఆమె వల్ల సినిమాకు జరిగే మేలు.. ఇలా అన్నీ చూసుకుని అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకాడట్లేదని సమాచారం.

This post was last modified on July 31, 2020 1:52 am

Share
Show comments
Published by
suman

Recent Posts

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

14 minutes ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

27 minutes ago

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను…

1 hour ago

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…

1 hour ago

ఆ రాష్ట్రంలో 400 మంది చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…

2 hours ago

ఆఖరి నిమిషంలో ఆగిపోయిన అన్నగారు

అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…

2 hours ago