సురేష్ బాబు ఆశలు వదిలేసుకున్నారా ?

టాలీవుడ్ లెజెండరీ నిర్మాత డా. డి. రామానాయుడు కుటుంబానికి మంచి గౌరవం ఉంది. ఈ కుటుంబం నుండి హీరోలుగా వచ్చిన వెంకటేశ కి అలాగే రానా లకు మంచి రెస్పాన్స్ దక్కింది. వెంకటేష్ తర్వాత రానా దగ్గుబాటి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరోను పరిచయం చేసే కార్యక్రమం జరిగింది.

తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి సురేష్ బాబు మరో కొడుకు అభిరామ్ అహింస అనే సినిమా చేశాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా నెలలు గడుస్తుంది. ఏప్రిల్ 7 న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అసలు అహింస వస్తుందా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే దగ్గుబాటి కుటుంబం నుండి ఓ హీరో వస్తున్నాడంటే కొంత సందడి ఉండాలి.

అలాంటి హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో సురేష్ బాబు తన కొడుకు డెబ్యూ సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్టేనా ? అనే కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత కాదు కానీ అంతా ఆయనే చూసుకుంటున్నారు. రానా కూడా రిలీజ్ , ప్రమోషన్స్ విషయంలో తన వంతు మాటలు అందిస్తున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి అహింస టీం ఎందుకు సైలెంట్ అయిపోయినట్టు ? ఒక వేళ అదే రోజు రవితేజ ‘రావణాసుర’ , కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఉన్నందున రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమాకి అన్నీ అడ్డంకులే తగులుతున్నాయి. ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో ? మరి.